Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నా ఇల్లు, ఒళ్లు గుల్ల చేశాడు... రూ.3.5 కోట్లు అడిగాడు.. అశోక్ గౌడ్

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (13:24 IST)
WD
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇల్లు, ఒళ్లు గుల్లగుల్ల చేశాడనీ, తనకు దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేస్తాడనుకుని రూ. 50 లక్షలకు పైగా ఖర్చు చేశానని దెందులూరు వైఎస్సార్సీపి నాయకుడు అశోక్ గౌడ్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఉన్న అభిమానంతో తాను పార్టీలో చేరితే జగన్ మోహన్ రెడ్డి తనను అన్నివిధాలా ఉపయోగించుకున్నారనీ, ఓదార్పు యాత్ర, జడ్పీటిసి, ఎంపీటీసి ఎన్నికల్లో ఖర్చు... అంతా కలిసి ఇప్పటికే రూ. 50 లక్షలకు పైగా ఖర్చయిపోయిందన్నారు.

ఐతే తనకు దెందులూరు సీటు ఇస్తారన్న నమ్మకంతోనే ఇదంతా చేసినట్లు తెలిపారు. తీరా సీటు కోసం అడిగేత... రూ.3.5 కోట్లు డిపాజిట్ చేసి అనంతరం సీటు కోసం అడగాలని జగన్ ఖరాఖండిగా చెప్పారనీ, దాంతో హతాశుడనయ్యానంటూ బోరుమన్నారు.

ఇపుడు తన భార్యాపిల్లలు, తాను నడిరోడ్డుపై నిలబడినట్లు అయిపోయిందనీ, మమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి బజార్న పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో ఇప్పటికే స్థాయికి మించి ఖర్చు చేసి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Show comments