Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ 69 మంది అభ్యర్థుల్లో శంకరమ్మ.. నాకదెందుకంటూ శంకరమ్మ

Webdunia
శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (17:36 IST)
WD
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తూ తన ప్రాణాన్ని బలిదానం ఇచ్చిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తెరాస అధినేత కేసీఆర్ ఇవాళ ప్రకటించిన 69 మంది అసెంబ్లీ ఎన్నికల పోటీ అభ్యర్థుల్లో సీటు కేటాయించారు. కానీ కేసీఆర్ కేటాయించిన నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కేసీఆర్ నిలబడినా గెలవరనే విమర్శ ఉన్న నేపధ్యంలో శంకరమ్మ కేసీఆర్ పై ధ్వజమెత్తినట్లు సమాచారం. తెరాస గెలవలేని సీటు తనకు ఇస్తారా అని శంకరమ్మ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ టిక్కెట్‌ని కేటాయించినట్లు తెలిపారు. ఐతే ఈ స్థానం తెరాస ఓడిపోయే స్థానమనీ, అక్కడ పోటీకి దిగితే కెసిఆర్ కు సైతం డిపాజిట్లు దక్కవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కనుకనే పనిగట్టుకుని ఆమెకు అలాంటి ఓడిపోయే స్థానాన్ని కట్టబెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. శంకరమ్మ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వల్లనే ఈ సీటు ఇచ్చారనీ, లేదంటే అసలు ఆయనకు శంకరమ్మకు సీటు ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.

ఏదయితేనేం... శంకరమ్మ కోరుకున్నట్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కెసిఆర్ ఇలా కల్పించడం ద్వారా ఆమె నుంచి ఎదురవుతున్న సమస్యను అలా వదిలించుకున్నాడన్న విమర్శలు వస్తున్నాయి
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

Show comments