Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున.. శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (17:52 IST)
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. దీపావళి పండుగ రోజున శ్రీ లక్ష్మిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
నరకాసురుని వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. దీపావళి రోజున లేదా మంగళ, శుక్రవారాల్లో ఓ చెక్క పీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచాలి. పటానికి ముందు ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి. 9 నాణేలను తీసుకుని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి. 
 
పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించుకోవచ్చు. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే కుబేర గాయత్రీ మంత్రం : ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్.. ను 108సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments