శనిదోష నివారణకు దీపావళి రోజు ఏం చేయాలంటే..?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:29 IST)
దీపావళి రోజు ఉదయాన్నే తలకిస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తాం. మొత్తం అంతా పూర్తైంది ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించాలి.
 
బాణసంచా కాల్చడం పూర్తయ్యాక ఇక పండుగ హడావుడి పూర్తైంది లోపలకు వెళ్లిపోవడమే అనే సమయంలో... ఉదయం నుంచి నానబెట్టి ఉంచిన నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట, నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. 
 
కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనిని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదా... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం. వైద్యం కన్నా నమ్మకం ప్రధానం అన్నట్టు ఇదికూడా అంతే. ఇలాచేస్తే శనిప్రభావం తగ్గుతుందనే భావన కూడా సగం బలాన్నిస్తుందంటారు పెద్దలు. ఇక ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ఫాలో అవొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వాహనం ఆపి తీరిగ్గా ఫోన్ సంభాషణ చేస్తున్న వ్యక్తిని గుద్దేశాడు, తప్పెవరిది? వీడియో

మద్యం విషయంలో గొడవ.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు స్నేహితులు

తితిదే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మే 10 - 11 తేదీల్లో రాతపరీక్షలు

పీఎం ఈ-బస్ సేవా స్కీమ్‌- తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులు

ప్రియుడి భార్యను, పిల్లల్ని కత్తితో పొడిచి చంపిన మహిళ, కాళ్లు పట్టుకున్నా వదల్లేదు...

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తెరుచుకున్న కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు -51 క్వింటాళ్ల పూలతో అలంకరణ

22-04-2026 బుధవారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు

తర్వాతి కథనం
Show comments