Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి.. తమలపాకుపై స్వస్తిక్ గుర్తు.. చెరకు రసం నైవేద్యం..

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (20:04 IST)
దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళి నాడు ఇంటింటా దీపాలు వెలిగిస్తారు. చీకటి నుండి వెలుగులోకి పయనించడం ద్వారా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడానికి దీపావళి ప్రతీక. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసే వారికి సకలసంపదలు చేకూరుతాయి. అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని ప్రతీతి. 
 
దీపావళి అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ సమేతంగా వినాయకుడిని, కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. ఇలా పూజించడం ద్వారా సర్వసుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీ పూజ సమయంలో ఆమె పాదాలను పూజించాలి. ముఖ్యంగా లక్ష్మీపూజ చేసేటప్పుడు తప్పకుండా తామరపువ్వును వుంచడం మరిచిపోకూడదు. దీపావళి నాడు శ్రీయంత్రాన్ని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. 
 
శ్రీయంత్రం లేకుండా లక్ష్మీ పూజ అసంపూర్ణమని పండితులు చెప్తున్నారు. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు.. డ్రైఫ్రూట్స్‌తో చేసిన పాయసాన్ని సమర్పించాలి. తమలపాకుపై స్వస్తిక్ గుర్తును వేసి వుంచి పూజచేయడం మంచిది.  
 
చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీపూజ సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది అదృష్టం ,శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

Mogalthuru : మొగల్తూరుపై కన్నేసిన పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

తర్వాతి కథనం
Show comments