Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళిపై కన్ఫూజన్ వద్దు.. పండుగ ఆ రోజే

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (17:57 IST)
దీపావళి పండుగ ఎప్పుడు  జరుపుకోవాలన్న దానిపై సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. ఆదివారమే దీపావళి అని కొందరు అంటుంటే, కాదుకాదు సోమవారం దీపావళి అని మరికొందరు భావిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం అయితే సోమవారం సెలవు దినం ప్రకటించింది. హైకోర్టుకు కూడా సోమవారమే సెలవు.
 
అయితే పండితులు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే చతుర్థశి ఘడియ రేపు మధ్యాహ్నం నుంచి వస్తుంది. దీపావళి పండుగ సోమవారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వియుజ అమావాస్య రోజు వస్తుంది. దీపావళి పండుగ ముందురోజు ఆశ్వీయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
 
దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చటం వల్ల ఆ వెలుగులో శబ్ధ తరంగాలలో దారిద్ర్యం, బాధలు దూరంగా తరిమేయబడి లక్ష్మీ కటాక్షం సిద్థిస్తుందని పురాణాల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను అయిదు రోజుల పాటు జరుపుకుంటుంటారు.

ఉత్తరాది వ్యాపారాలు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు. వీటినన్నింటినీ చెబుతూ పండితులు దీపావళి సోమవారమేనని, ఆదివారం చతుర్థశి ఘడియ ప్రారంభమవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి సోమవారం వరకు చేసుకోవచ్చంటున్నారు. కాబట్టి రేపు, ఎల్లుండి దీపావళి పండుగను జరుపుకోవచ్చంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments