దీపావళి లోపు ఈ వస్తువులుంటే పడేయండి..

దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు. దీపావళి లక్ష్మీద

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:06 IST)
దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు. దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. 
 
లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరేనని పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. 
 
లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి..లేకుంటే బయట పడేయాలి. 
 
ఆగిపోయిన గడియారం.. విరిగిన గడియారం ఉంటే పడేయాలి.. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం

Nara Devansh: జెన్ జెడ్ కంటెంట్‌ క్రియేటర్‌గా నారా దేవాన్ష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు (video)

బండి సంజయ్‌ కుమారుడికి పదేళ్లు జైలుశిక్ష పడేలా అదనపు సెక్షన్లు

గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

తర్వాతి కథనం
Show comments