Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
బుధవారం, 30 అక్టోబరు 2024 (18:47 IST)
అక్టోబర్ 31, 2024న దీపావళి పండుగను జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. దీపావళి పండుగ అంటేనే దీపాల వరసతో ఇంటిని దేదీప్యమైన వెలుగులతో నింపేస్తారు. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.
 
ఐదు వత్తులు :
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.
 
ఏ నూనె మంచిది : ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
 
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
 
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
 
దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.
 
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments