దీపావళి వచ్చేస్తోంది, రెండ్రోజులు ముందు ఇవి చేయండి

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (22:26 IST)
దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరేనని పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. 
 
లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. 
 
పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి..లేకుంటే బయట పడేయాలి. 
 
ఆగిపోయిన గడియారం.. విరిగిన గడియారం ఉంటే పడేయాలి.. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. 
 
చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments