Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల సౌభాగ్యానికి ప్రతీక దీప ప్రజ్వలన

Webdunia
దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించడమవుతుందని పండితులు చెబుతున్నారు.

తేజస్సు, విజ్ఞానం, వివేకం, వినయాలకు దీపప్రజ్వలన సంకేతమని సందేశాత్మకంగా భావిస్తారు. దీపాల పండుగైన దీపావళిని జీవితంలో పారమార్థిక వెలుగు రేఖలను నింపే పర్వదినంగా హిందువులు నమ్ముతున్నారు.

" దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోహరమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీపం నమామ్యహమ్"

- అంటూ మహిళలు ప్రార్థిస్తూ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి ప్రతీకలుగా భావించడం ఆనవాయితీ.

పంచభూతాలలో ప్రధానమైన అగ్ని... ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ప్రసాదిస్తుంది. అలాంటి తేజస్సును, విజ్ఞానాన్ని, మనుగడను దీపాల వెలిగింపుతో పొందవచ్చునని ఆర్యుల విశ్వాసం. దీపావళి రోజున దీపాలను వెలిగిస్తే మూల్లోకాలను పరిపాలించే బ్రహ్మ, విష్ణువు, శివపరమాత్మలను పూజించినట్లవుతుందని పండితులు అంటున్నారు.

" అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే "

అంధతమిస్రంచమనేది ఒక నరకమని, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకునేందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయడం ఉత్తమైన కార్యంగా పెద్దలు భావిస్తున్నారు. అందుకే దీపావళి రోజున దీపాలను వెలిగిస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments