Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి స్పెషల్: గుల్కన్ గులాబ్ జామూన్!

Webdunia
FILE
ఈ దీపావళికి మీ ఇంట్లో ఏయే స్వీట్స్ చేస్తున్నారు.? అదే స్వీట్స్ చేసే పనిలోనే ఉన్నట్లైతే గుల్కన్ గులాబ్ జామూన్ ట్రైచేసి చూడండి.

కావలసివ పదార్థాలు :
కోవా లేదా గుల్కన్- ఒక కప్పు
పాలు - ఒక కప్పు
నెయ్యి - వేయింపుకు సరిపడా
యాలకుల పొడి- అర టీ స్పూన్
పంచదార - రెండు కప్పులు
గులాబ్ జామ్ పౌడర్ - 200 గ్రాములు
జీడిపప్పు -50 గ్రాములు
బాదం పప్పు - 50 గ్రాములు
పాకానికి పంచదార - అరకేజీ

తయారీ విధానం :

ముందుగా పాన్ స్టౌపై ఉంచి.. కొద్ది నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేపుకోవాలి. అలాగే మరో స్టౌపై ప్యాన్ ఉంచి కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేతపాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్‌‌గాని కలుపుకోవచ్చు.

తర్వాత గులాబ్‌జామ్ పౌడర్‌లో పాలు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో గులాబ్‌ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో గుల్కన్ లేదా కోవా ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి.

ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పంచదార పాకంలో వేయాలి. బాదం, జీడిపప్పులను గార్నిష్‌గా అలంకరించి సర్వ్ చేయాలి. గుల్కన్ గులాబ్ జామూన్ రెడీ..
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

Show comments