Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజనుల ఇంట దీపావళి

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2007 (12:34 IST)
FileFILE
గిరిజనులు అధికంగా నివసించే మధ్యప్రదేశ్‌లోని బార్వని, థార్, ఖర్గోనే మరియు ఝబువా జిల్లాలలో దీపావళి పండుగను విన్నూత్నంగా జరుపుకుంటారు. దీపావళికి నెలరోజుల ముందు గ్రామంలో ఎవరైనా చనిపోతే దీపావళి పండుగను జరుపుకోవడం మానేస్తారు. ఇక బరేలా తెగకు చెందిన గిరిజనులు దీపావళి పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు.

మొదటిరోజు ఆవు పేడతో ఇంటిని అలుకుతారు. తర్వాత ఆవుపేడతో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పండుగకు ముందుగానే ఇతర గ్రామాలలో నివసించే బంధువులకు ఆహ్వానం పంపుతారు. పండుగకు ముందు రోజు దైవప్రార్థనకు ఉద్దేశించిన సామాగ్రితోపాటు ఒక గుడ్డు, సజ్జ విత్తనాలు, మరియు టేకు గోళ్ళతో కూడిన బుట్టను ప్రతి కుటుంబానికి చెందిన సభ్యుడు గ్రామ పెద్దకు అందచేస్తారు.

FileFILE
గుడ్డు దొరకని పక్షంలో కోడి లేదా కోడిపిల్ల యొక్క గోళ్ళను కత్తిరించి గ్రామ పెద్ద ఇంటి ముందు ఉంచుతారు. అనంతరం ఆ కోడిని ఇంటికి తీసుకువచ్చి దీపావళి దేవత అయిన "ఆయేఖేడా మాత"కు సమర్పిస్తారు. పండుగ మొదటి రోజు గ్రామంలోకి దెయ్యాలు ప్రవేశించకుండా టేకు గోళ్ళను గ్రామ పెద్ద గుంటతవ్వి పూడ్చి పెడతాడు. తరువాత అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి, సిరిసంపదలకు చిహ్నంగా ఒక పెద్ద జ్యోతిని ఊరి పొలిమేరలో వెలిగిస్తారు.

ఊరిలోకి తిరిగి వచ్చే సమయంలో జ్యోతిని చేబూని ఊరంతా తిరుగుతూ "బెరియా బెరియా కురవ్" (ఈ జ్యోతి నిరంతరం వెలగాలి) అని నినాదాలు చేస్తారు. చివరగా గ్రామ పెద్ద ఇంటి ముందు అందరూ చేరి జ్యోతిని ఆర్పివేస్తారు. ఇక పండుగ రెండవ రోజు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి అతిథులకు అన్నం, పప్పు మరియు హల్వాతో కూడిన విందుభోజనాన్ని పెడతారు. భోజనానంతరం డోలు మోగించి, బాణసంచా కాలుస్తారు.

FileFILE
పొద్దుపోయేదాకా మద్యం సేవిస్తూ నృత్యగానాలలో మునిగితేలుతారు. అదేసమయంలో ఒక కోడిని, మద్యంసీసాను దేవతకు నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగు దిశల నుంచి కమ్ముకుని వచ్చే సమస్యలనుంచి రక్షణ కల్పించమని కోరుతూ ఆవుపేడతో చేసిన ప్రమిదలో నాలుగు వత్తులను వెలిగిస్తారు. చనిపోయిన తమ వారిని తలుచుకుని గిరిజన మహిళలు కన్నీళ్ళు పెడతారు.

పండుగ మూడవ రోజును పశువులను పూజించడానికి కేటాయిస్తారు. తెల్లావారు ఝూమునే కుటుంబ సభ్యులు నిద్రలేచి ఎద్దుల కొమ్ములను కడిగి పాలు, 'గేరు' మిశ్రమంతో కొమ్ములకు ఎరుపు రంగును అద్దుతారు. అనంతరం కుటుంబ పెద్దతోపాటు మరో ముగ్గురు సభ్యులు 'టగరీ' (ఇనుప పాత్ర)లో బాజ్రా ఛఫ్‌ను పశుగణానికి నివేదించి, వెండి నాణేలు మరియు ఆభరణాలతో వాటి పాదాలకు నమస్కరిస్తారు.

ఆ రోజు పశువులకు ఎలాంటి పనిని అప్పగించరు. అలంకరించబడిన ఎద్దులను గ్రామంలో జరిగే ఎద్దుల పందాలలో పాల్గొంటాయి. తమ పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ బంకమట్టితో చేసిన లోటా, గుఱ్ఱాన్ని 'గుహ బాబా'కు సమర్పించుకుంటారు. ఇక తమకు అనుకూలమైన కాలంలో దీపావళి పండుగను జరుపుకునేందుకు గాను 10-15 గ్రామాలకు చెందిన పెద్దలు సమావేశమై ఒక తేదీని నిర్ణయిస్తారు.

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments