Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబుల రాముడు మారిపోయాడు

Webdunia
సోమవారం, 5 నవంబరు 2007 (20:42 IST)
నిజంగానే ఆటంబాంబు రాముడు మారాడు. ఇప్పుడు ప్రమిదలోని దీపం లాగ ప్రశాంతంగా ఉంటున్నాడు. పేరు కూడా మారిపోయింది. నిన్న మొన్నటి దాకా ఎంత అల్లరి చేసేవాడు. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు రాము వాళ్ళ అమ్మా నాన్న గుండెల్లో ఆటంబాంబులు పేల్తాయి. పండుగకు నెలరోజుల ముందు నుంచే నాన్నను దబాయించి టపాసులు కొనిపించుకుంటాడు. ఇక అంతే... రాత్రి లేదూ పగలూ లేదు టపాసులు కాలుస్తునే ఉంటాడు.

అప్పుడే అల్మారాలోని దీపావళి తుపాకీ బయటకు తీస్తాడు. ఇట్లాంటి పనుల్లో రాముకు ఉండే శ్రద్ధ మరెవ్వరికీ ఉండదు. తుపాకీతో పాటు కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకుంటాడు. రోల్ లోడ్ చేసే చోట తప్ప మిగిలిన తుపాకీ అంతా కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తాడు. లోడ్ చేసే చోట నూనె తగిలితే ట్రిగర్ నొక్కినప్పుడు రోల్‌ పైన ఉండే డాట్స్ పేలకుండా పోతాయని రాముకు బాగా తెలుసు మరి. అంతే రోజంతా తుపాకీ మోతే. ఇల్లంతా రోల్స్‌తో నిండిపోతుంది.

దీపావళి రోజుల్లో రాము వలన ఇంట్లో పోగయ్యే చెత్తనంతా శుభ్రం చేసేందుకు ఉన్న పని మనిషికి తోడు మరో పని మనిషిని వాళ్ళమ్మ పనిలో పెట్టుకుంటుంది. ఇక తుపాకీ చేత పట్టుకుని రాము చేసే హంగామా అంతా ఇంతా కాదు. కాంపౌండ్‌లో పది రౌండ్లు తిరిగాక సైకిల్ తీసుకుని తమ ఇంటి ముందున్న వీధిలోకి వెళ్తాడు. ఒక చేత్తో సైకిల్ నడుపుతూ మరొక చేత్తొ తుపాకీ పేలుస్తుంటాడు.

రోడ్డు మీద ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు... రాము ఆటకు పగ్గాలు ఉండవు... వాళ్ళ దగ్గరకు స్పీడ్‌గా వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తాడు. వాళ్ళు ఉలిక్కిపడి ఏడుపు ముఖం పెట్టి రాము వైపు భయం భయంగా చూస్తారు. వాళ్ళలా చూస్తుండగానే తుపాకీని వాళ్ళ ముఖానికి దగ్గరగా పెట్టి ఢామ్మని పేలుస్తాడు. పిల్లల ఏడుపు విని పెద్దలు రాగానే సైకిల్‌ మీద ఝూమ్మని వెళ్ళిపోతాడు. మనవాడి టపాసుల మోతను వినగానే ఆ వీధిలో వాళ్లకు గుర్తుకు వస్తుంది... దీపావళి పండుగ వస్తుందని...

మరి ఈసారి దీపావళికి రాము వాళ్ళుండే వీధిలో ఎలాంటి టపాసుల మోత వినపడకపోవడం అక్కడి వాళ్ళను ఆశ్చర్యపరిచింది. రాము ఇంట్లో కూడా ఎలాంటి చప్పుడు వినిపించడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాము ఊరికి వెళ్ళి ఉంటాడు అనుకుంటున్నారా? కాదు కాదు.. మన రాముకు అన్నయ్యగా ప్రమోషన్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్ళిన రాము వాళ్ళ అమ్మ బుజ్జి పాపతో ఇంటికి వచ్చింది.

అమ్మ పక్కన పడుకుని ఉన్న బుజ్జి పాపను రాము ఏమైనా చేస్తాడేమోనని అందరూ భయపడ్డారు. బుజ్జి పాప దగ్గరకు వచ్చాడు రాము. అందరిలోను ఒకటే టెన్షన్... మన రాము బుజ్జి పాపను తేరిపార చూసి ముఖం మీదకు వంగి ముద్దు పెట్టుకున్నాడు. అందరు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి చెల్లాయిని వదలితే ఒట్టు. స్కూల్‌‌ నుంచి వచ్చాడంటే చాలు చెల్లాయితోనే రాము లోకం. ఒకరోజు దీపావళి తుపాకీ గుర్తుకు వచ్చింది. బయటకు తీసి రోల్ లోడ్ చేసి టపాటపామనిపించాడు.

అంతే నిద్రపోతున్న బుజ్జి పాప ఉలిక్కి పడి లేచింది. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. పాప ఏడుపును విని రాము కంగారుపడ్డాడు. పాప దగ్గరకు పరిగెత్తాడు. మంచం పక్కనే కూర్చుని పాపను చూడసాగాడు. పాప కూడా ఏడుపు ఆపి రామును చూసింది. పాప ఏడుపు ఆపగానే బయటకు వచ్చిన రాము కింద పడి ఉన్న తుపాకీని ఒక్కసారి చేతిలోకి తీసుకుని కాసేపు దాన్ని చూసి విసురుగా గోడ అవతలకు పారేసాడు. అంతే.... ఆ రోజు నుంచి రాము మారిపోయాడు. బుజ్జిపాపే తన లోకంగా మంచి బాలునిగా అందరి మెప్పును పొందాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments