Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిస్తున్న జికా వైరస్.. సోకితే శాశ్వత అంగవైకల్యమే... డెంగీ, చికెన్‌గున్యా కూడా వస్తాయట!

Webdunia
గురువారం, 28 జనవరి 2016 (15:28 IST)
మొన్న ఎయిడ్స్.. నిన్న ఎబోలా.. నేడు జికా. ఈ వైరస్‌లు ప్రపంచ వైద్య శాస్త్రానికే ఓ సవాల్‌గా నిలిచాయి. వీటిలో ఎయిడ్స్ వైరస్.. విశృంఖల శృంగారం వల్ల సోకుతుంది. ఎబోలా ఆఫ్రికా ఖండంలోని గబ్బిలాల వల్ల వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇపుడు జికా వైరస్ వెలుగు చూసింది. ఆఫ్రికా దేశంలోని అడవుల్లో ఉండే దోమల ద్వారా వ్యాపిస్తుందట. ఈ వైరస్ ప్రధానంగా గర్భిణీ మహిళలపైనే అధిక ప్రభావం చూపుతుందట. వారికి ఈ వైరస్ సోకడం వల్ల గర్భంలోని పిండం ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. అంతేకాదండోయ్... జికా వైరస్‌కు వాహకంగా పనిచేసే దోమలు... డెంగీ, చికెన్‌గున్యా వంటి వ్యాధులను సైతం వ్యాపింపజేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. 
 
ప్రస్తుతం ఈ వైరస్ లాటిన్ అమెరికన్ దేశాలతో పాటు.. దక్షిణ అమెరికా ఖండంలోని 22 దేశాలను వణికిస్తోంది. ఈ దేశాల్లో జికా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. నిజానికి ఈ జికా వైరస్‌ను మొదట ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. ఉగాండా నుంచి ఆగ్నేయాసియా దేశాలకు, కరేబియన్ దేశాలకు అక్కడ నుంచి లాటిన్ అమెరికన్ దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దక్షిణ అమెరికా ఖండంలో ఏకంగా 22 దేశాల్లో జికా వైరస్ విజృంభిస్తోంది. బ్రెజిల్‌లో గతేడాది జికా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంవత్సరం ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు స్థానిక వైద్యులు చెపుతున్నారు. 
 
మెక్సికోలో 18 మందికి జికా వైరస్ సోకినట్లు ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. జియాపాస్, జలిస్కో, నియోలియోన్ రాష్ట్రాల్లో జికా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నట్లు మెక్సికో వైద్య విభాగం ప్రకటించింది. రాబోయే వేసవి, శీతాకాలాల్లో జికా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని వైద్యాధికారులు హెచ్చరించారు. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుతోంది. గర్భిణి స్త్రీలకు జికా వైరస్ సోకితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణి స్త్రీలు అన్ని ఆరోగ్య పరీక్షలు సక్రమంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి గర్భిణీ స్త్రీల రాకలపై పలు దేశాలు ఆంక్షలు కూడా విధించడం గమనార్హం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments