Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్ర.. చంద్రన్న సర్కారు ఉలికిపాటు... ఎందుకు?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు ఏపీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు.

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (11:53 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు ఏపీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. 
 
నిజానికి మన రాష్ట్రంలో పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. నాయకులను ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కూడా. ఇది గత చరిత్ర. కానీ, ఇపుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 
 
నిజానికి ఎన్ని మీటింగులు, ప్రెస్‌మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్షలాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు విపక్షనేత జగన్. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. 
 
మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు పక్కా ఏర్పాట్లు చేశారు. ఆ పార్టీ నేతలు విజయవాడలో రూట్ మ్యాప్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పించి, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అయితే, ఈ పాదయాత్రపై చంద్రన్న సర్కారు ఉలికిపాటుకు గురవుతూ లేనిపోని విమర్శలకు ఇప్పటినుంచే దిగడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments