Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గారూ...! మీరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది..!

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:25 IST)
జనం తరపున ప్రశ్నించడానికి, ప్రభుత్వాలను నిలదీయడానికి ఒకడుండాలి. ఆ పాత్ర తాను తీసుకుంటానంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏనాడో చెప్పాడు. అందుకే ఆయన తాను పార్టీ పెడుతున్నట్లు కూడా చెప్పారు. జనసేన పార్టీ పెట్టేశారు. రైతులకు అన్యాయం జరిగితే రాజధాని రైతుల కోసం ప్రభుత్వంపై అవసరమైతే పోరాటం చేస్తానని ప్రకటన కూడా చేసేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కి వ్యతిరేక నినాదం చేస్తూ కేంద్రంలో బీజేపీకి, రాష్ర్టంలో టీడీపీకి మద్దతు పలికాడు పవన్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించి బీజేపీతో దోస్తీ చేశాడు. వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి వాళ్ల తరపున ప్రచారం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు అన్నివిధాల న్యాయం దక్కేవరకు పోరాడతానని నాడు స్పష్టం చేశారు. 
 
ఆయన అనేక సందర్భాలలో ప్రజల కోసం ఎంతటి వారిని ప్రశ్నించడానికైనా వెనుకాడబోనని చెప్పాడు. దీనికి కొనసాగింపుగా ఈ మధ్యే ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణని వ్యతిరేకిస్తూ అక్కడి గ్రామాల్లో పర్యటించాడు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే బాధితులకు అండగా ఎంతటి పోరాటమైనా చేస్తాను అంటూ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించాడు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వానికీ ఓ మాట గుర్తు చేశారు. మోడీ మాట నిలుపుకోవాలని కోరారు. 
 
ఇంతలోనే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ అంతా సవ్యంగా సాగిపోతున్నట్లు ఆయన కొన్నాళ్లపాటు సినిమాలు చేసుకుందామని భావించారు పాపం. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి గబ్బర్‌సింగ్-2 మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే ఆయనను ఆడిన మాట వెంటాడుతోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదంటూ కేంద్రం దాదాపుగా ఓ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ పోరాటం చేయాల్సిన వచ్చిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. సినిమా ప్రారంభిద్దామంటే ఆయన చేసిన మాటలన్ని ఉత్తుత్తి మాటలేనని తేలిపోతుంది. రాజకీయాల్లో వచ్చేద్దామానుకుంటే ఫామ్ లో ఉన్న తాను ఇప్పటి నుంచే రాజకీయాలు తన ఒంటికి అంతగా సరిపోవనే విషయం ఆయన స్పష్టంగా తెలుసు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలేమి లేవు. ఇలాంటి సమయంలో ఫుల్ టైం రాజకీయాలు చేస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం అనుమానమే. ఇలాంటి సమయంలో రాజకీయాలా ? సినిమాలా ?  గబ్బర్ సింగ్ ఏం చేస్తాడో వేచి చూద్దాం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments