Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నా జగన్.... నాగార్జున భరోసా.. ఏ విషయంలో?

అసలే జనసేన పార్టీతో రెండు ప్రముఖ పార్టీలు సతమతం. అందులోను పవన్ కళ్యాణ్‌ లాంటి వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే ఓట్లు చీలిపోయి కష్టకాలం వస్తుందనేది వైసిపి, టిడిపి నేతల ఆలోచన. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు,

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (21:30 IST)
అసలే జనసేన పార్టీతో రెండు ప్రముఖ పార్టీలు సతమతం. అందులోను పవన్ కళ్యాణ్‌ లాంటి వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే ఓట్లు చీలిపోయి కష్టకాలం వస్తుందనేది వైసిపి, టిడిపి నేతల ఆలోచన. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ప్రధాన ఎన్నికలు రానున్నాయి. అందులోను ముందస్తు ఎన్నికలే. ఇక మిగిలింది చాలా తక్కువ సమయం. ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుండగా, ఈ ఎన్నికల్లో తమదే గెలుపన్న ధీమాతో వైసిపి ఉంది. 
 
అయితే జనసేన మాత్రం పోటీ చేస్తే రెండు పార్టీలకు ఇబ్బందులు తప్పవనేవి రాజకీయ విశ్లేషకుల భావన. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రచారకర్తను నియమించుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులోను ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తయితే మరీ మంచిదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే ఆలోచించి ఒక నటుడిని ఎంచుకున్నట్లు సమాచారం. ఆయనే నాగార్జున. ఇప్పటికే నాగార్జునకు మంచి క్రేజ్ ఉంది. అగ్రహీరోల్లో ఆయన కూడా ఒకరు. 
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితులు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి కూడా నాగార్జున మంచి మిత్రుడు. ఇదంతా జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశమే. గత కొన్నిరోజుల ముందు నాగార్జునను స్వయంగా కలిసిన జగన్ వైసిపి ప్రచారకర్తగా చేయాలని కోరారట. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా సహాయం చేయాలని చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశారట జగన్. దీంతో నాగార్జున చిన్న విషయానికి ఇంతలా అడగాల్సిన అవసరం లేదనీ, ఖచ్చితంగా తన వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారట. అయితే అది ఎప్పుడనేది మాత్రం నాగార్జున స్పష్టంగా చెప్పలేదట. కనీసం మాట ఇచ్చినందుకు జగన్ ప్రస్తుతం సంతోషంగా ఉన్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments