ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్వరూపం మారబోతోందా..?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (21:31 IST)
ఆంధ్రపదేశ్ స్వరూపం మారబోతుందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. 13 జిల్లాలు కాస్తా.. 25 జిల్లాలు కాబోతున్నాయా..? అవుతాయి. కానీ ఇప్పుడే కాదు. వచ్చే సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భవిష్యత్‌లో 25 జిల్లాలుగా చేస్తామని.. ఏపీ స్వరూపాన్ని మారుస్తామని జగన్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. 
 
సంక్షేమ పధకాలు అమలు జరపడంలో జెట్ స్పీడుతో పనిచేసిన జగన్ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మాత్రం ఆ దూకుడును కొంతమేర తగ్గిస్తే బాగుంటుందనే భావనతో జగన్‌ సర్కార్ ఉన్నట్టు కన్పిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఇప్పట్లోనే మొదలు పెట్టేద్దామని గతంలో భావించిన సర్కార్‌.. దానికి అనుగుణంగా కొద్దిపాటి కసరత్తు కూడా చేసింది. 
 
ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఏపీలోని 13 జిల్లాల సగటు జనాభా 37.98 లక్షల మంది. అలాగే పొరుగునున్న తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో జిల్లాల సగటు జనాభా 11.35 లక్షల మంది మాత్రమే ఉంది. ఆర్థిక పరిపుష్టి పూర్తిగా లేకుండా జిల్లాల విభజన చేస్తే.. మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే భావనతోపాటు.. ఇంకొన్ని సాంకేతిక.. రాజకీయ కారణాల వల్ల కూడా ఈ ప్రక్రియను తాత్కాలింగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. 
 
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఆలోచన లేదని.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టే అంశం గురించి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రియల్ పెండ్లి కంటే ముందే రణబాలి లోని రీల్ పెండ్లి సాంగ్ రష్మికకు అంకితం

తమిళ హీరో విజయ్ రిలేషన్‌లో వున్న నటి ఎవరో తెలిసినా చెప్పేందుకు ధైర్యం లేక పిసుక్కుంటున్నారట

Son of Review : ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌గా సన్ ఆఫ్ చిత్రం - రివ్యూ..

Pawan Kalyan battula: ఇలస పులస దేవనాయకి అంటూ సాగే పురుషః సాంగ్

Kiara Advani: టాక్సిక్ ది మూవీ వన్ నుండి తబాహి పాటలో యాష్, కియారా అద్వానీ - ది బెస్ట్ షాట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments