Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు ప్రజలపై ఎందుకు హత్యలు జరుగుతున్నాయి.... ఏం చేయాలి?

శ్రీనివాస్ కూచిభట్ల హత్యోదంతంతో అమెరికన్ భారతీయ సమాజం కలవరపాటుకి గురైంది. నిజానికి ఇంతకుముందు కూడా అమెరికాలో కొంతమంది భారతీయులు హత్యకు గురయ్యారు. కానీ అంతకుముందెన్నడూ లేని ఉలికిపాటు ఇప్పుడు కనిపిస్తోం

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (16:44 IST)
శ్రీనివాస్ కూచిభట్ల హత్యోదంతంతో అమెరికన్ భారతీయ సమాజం కలవరపాటుకి గురైంది. నిజానికి ఇంతకుముందు కూడా అమెరికాలో కొంతమంది భారతీయులు హత్యకు గురయ్యారు. కానీ అంతకుముందెన్నడూ లేని ఉలికిపాటు ఇప్పుడు కనిపిస్తోంది. దీనికి కారణం చాలా స్పష్టం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శైలి. ఆయన ఎన్నికల్లో అవలంభించిన విధానాలు ఘన చరిత్ర కలిగిన అమెరికా ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడూ హుందాగా కేవలం ఆర్థిక, అభివృద్ధి విధానాల ప్రాతిపదికన మాత్రమే జరిగేవి. నిజానికి 2001 ముందువరకు అమెరికా సమాజం మేము అందరికీ ఉపాధి కల్పిస్తున్నాం. అందరి కన్నా గొప్పగా ఉన్నాం అనే ఒక భావనలో ఉండేవి. 
 
అదేసమయంలో మనిషికి గౌరవాన్ని ఇచ్చేవి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ పెత్తనం చెలాయించాలని చూసిన 18, 19శతాబ్ధాల నుంచి అమెరికా పాఠం నేర్చుకుంది. ఎదుటివారికి కించపరడం కాకుండా గౌరవంగా చూసి తద్వారా తమ దేశాభివృద్ధికి వారి సేవలను వినియోగించుకుంది. తద్వారా ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నా సమాజం మాత్రం చాలా భద్రమైన జీవితం అనే భావనలో ప్రశాంతంగా కాలం వెళ్లదీశారు. మన భారతీయ సామాజిక భాషలో చెప్పాలంటే కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధి చెందిన కొంతమంది నిమ్న కులస్తులను చూసి కులాలు లేవు అనుకునే ఒక అగ్రకుల భూస్వామి భావన అనుకోవచ్చు. వాటి మధ్య వ్యత్యాసాలు అణచివేతలు, భేదాలు అన్ని ఉన్నాయి. కానీ 2001సంఘటన ఒక్కసారిగా వారిని ఒక న్యూనతాభావనలోకి నెట్టేస్తాయి. ఒక్కసారిగా సమాజం కలవరపడింది. వారి మీద దాడిని అస్సలు ఊహించుకోలేని సమాజం ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని భయంగా చూడడం ప్రారంభించింది.
 
విపరీతమైన భయాందోళనలకు గురైంది. దానికితోడు అదేసమయంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, దానికితోడైన మత ఛాందసవాదుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోయింది. అప్పటివరకు అమెరికా తప్ప మరో ప్రపంచం ఉంది. అక్కడ మనుషులకు కూడా ఉద్వేగాలు, మత భావనలు ఉంటాయని కూడా పెద్దగా తెలియని అమెరికా సమాజం ఒక్కసారిగా తీవ్రమైన ఉద్వేగాలు, తీవ్రమైన మతభావనలను చూసి మరింతగా కలవరపడింది.
 
వాటి నుంచి తమల్ని తాము ఎలా రక్షించుకోవాలో తెలియక మథనపడుతున్నారు. ముందుగా ఆయా దేశాలపై యుద్ధాన్ని ప్రోత్సహించిన బుష్‌ని రెండవసారి గెలిపించారు. ఫలితం కనపడలేదు. మరోమార్గం ఆలోచించారు. 2009లో బరాక్ ఒబామా గెలవడానికి కూడా కారణం ఇదే. మనం ఆఫ్రికన్ మూలాలున్న వ్యక్తిని ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటే మిగతా సమాజాలు హర్షిస్తాయి. తద్వారా మనల్ని టార్గెట్ చెయ్యరు అనే భావంతోనే బరాక్ ఒబామాను గెలిపించారు. 
 
అప్రో అమెరికన్ ఒబామాను గెలిపించినా అమెరికా మీద టెర్రరిస్ట్‌లకు కానీ వాటికి దన్నుగా నిలిచే వారికి కానీ అమెరికా మీద ఎలాంటి సానుభూతి రాలేదు. దానికి కారణం అమెరికా ప్రభుత్వ విధానాలలో మార్పు రాకపోవడమే. కానీ అమెరికా సమాజం అది అర్థం చేసుకోలేదు. ఇదే సమయంలో అమెరికాలో నిరుద్యోగం పెరిగిన మాట వాస్తవం. నిరుద్యోగానికితోడు వారిలో గూడు కట్టుకున్న ఆత్మన్యూనత అనే భావన కలిపి వారిని ఒక విచిత్ర పరిస్థితుల్లో నెట్టాయి. 
 
అదేసమయంలో వచ్చిన ట్రంప్ ఈ ఆత్మన్యూన్యతను మరింతగా రెచ్చగొట్టాడు. అసలు మన సమాజం ఇలా ఉండడానికి కారణం మిగతా సమాజాలన్నీ అనే ఒక విపరీత భావజాలాన్ని ప్రజల్లో తీసుకువచ్చాడు. సహజంగా అప్పటికే మిగతా సమాజం పట్ల అసంతృప్తితో ఉన్న అమెరికా సమాజానికి ఈ మాటలు ఆకర్షణీయంగా అనిపించాయి. అదే నిజం అని నమ్మింది. మన సమాజం మిగతా సమాజానికి ఈ మాటలు ఆకర్షణీయంగా అనిపించాయి. అదే నిజం అని నమ్మింది. మన సమాజం మిగతా సమాజాల పట్ల స్నేహంగా ఉండాల్సిన పనిలేదు. వారిని గౌరవించాల్సిన పనిలేదు. అదే స్థితిలోకి వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే మధ్యయుగాలనాటి ఇంగ్లాండ్ భావజాలాన్ని తిరిగి ఆవహించుకుంది. లేదా మన అగ్రకుల భావజాలాన్ని తిరిగి తెచ్చుకుంది. తద్వారా మిగతా సమాజాలంటే ఒకరకమైన ఏహ్యభావాన్ని పెంచుకుంది.
 
సాధారణంగా ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన వాళ్ళెవ్వరు కూడా అమెరికా సమాజానికి ఇలాంటి అభిజాత్యాన్ని నూరిపొయ్యలేదు. ఎవరు వచ్చినా మనం అందరికన్నా మెరుగ్గా ఉన్నాం కాబట్టి మిగతా సమాజాలను ఈ రకంగా ఉద్దరిద్దాం అని చెప్పారే కానీ మనం మిగతా సమాజాల కంటే తక్కువగా ఉన్నాం అని చెప్పలేదు. మనమే ప్రపంచానికి పోలీసు అని చెప్పిన అధ్యక్షుల నుంచి మనల్ని మిగతా సమాజాలు మోసం చేస్తున్నాయి అని చెప్పిన ట్రంప్ వైఖరి అమెరికన్స్‌ని నచ్చింది. వారిలో ఉన్న ఆత్మనూన్యతకు అది ఒక ఉపశమనంలా అనిపించింది. అందుకే ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిచిన వెంటనే అమెరికన్ సమాజంలో ఉన్న మమ్మల్ని ఎవరో మోసం చేశారు అనే భావన వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయికి విస్తరించింది. దీనికి కారణం మిగతా దేశాల మీడియా ముఖ్యంగా ఏ సమాజాలనైతే చూసి అమెరికన్స్ ఆత్మనూన్యతలోకి వెళ్ళాలో ఆ దేశాల మీడియా ట్రంప్ మీద విపరీతమైన వ్యతిరేకత చూపించడమే కాకుండా, విజయం సాధించిన తర్వాత కూడా అమెరికన్ల సమాజం మిగతా సమాజాలు భయపడుతున్నాయంటే మనం చేసింది మంచిది అని భావన బలపడింది.
 
వలసదారులకు ఎప్పడూ రక్షణ ఉంటుంది. పైపెచ్చు అమెరికా ఆర్థికాభివృద్ధి కూడా వలసదారులు మీదే ఆధారపడి ఉంది. ఇది ట్రంప్‌కి తెలియకపోవచ్చు. అమెరికా సమాజానికి తెలియకపోవచ్చు కానీ. ప్రభుత్వానికి తెలుసు. అందుకే న్యాయస్థానాలు ట్రంప్ నిర్ణయాలను తప్పు పడుతున్నాయి. వలసదారులు ప్రభుత్వ పరమైన, రాజ్యాంగపరమైన రక్షణ పొందాలి. అదే సమయంలో అక్కడ ఉన్న సామాజిక ఉద్రిక్తతలను అర్థం చేసుకొని అక్కడి సమాజంలో ఇంతకుముందు కన్నా మరింత స్నేహపూర్వకంగా ఉండాలి. ఇది ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. 
 
ఇప్పటికప్పుడు వలసదారులకు వచ్చిన సమస్య ఏమీ లేకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. అదే సమయంలో అమెరికా సమాజంలో వ్యూరిష్టన్ లాంటి వారి కన్నా శ్రీనివాస్ ను రక్షించడానికి ప్రయత్నించిన గ్రిల్లోట్ లాంటి వాళ్ళే ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. వారి అండతో ముందుకు నడవాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. అమెరికా ఎప్పటికీ గొప్ప దేశమే. మంచిదేశమే. అది ఎప్పటికీ ఉన్నతంగా ఉండాలి. అమెరికా అంటే అమెరికన్ సమాజంతో పాటు అక్కడ ఉన్న వలసదారులు సమాజం కూడా. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments