Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకలో యువకుడి కొంటె పని... ఆగిన పెళ్లి

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (17:12 IST)
ఒక పెళ్లి వేడుకలో యువకుడు చేసిన కొంటెపనికి కొన్ని క్షణాల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఘాజీపూర్‌లో ఓ యువతికి పెళ్ళి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి అందరి మాదిరే ఓ యువకుడు కూడా వచ్చాడు. వధువు తరపు వారు అతడిని గమనించలేదు. వధువు వరుడి మెడలో దండ వేయబోతోంది. 
 
ఆ సమయంలో సదరు యువకుడు మండపంపైకి వెళ్లి ఒక్కసారిగా వధువు నుదుటిపై సింధూరం దిద్దాడు. ఇది చూసి పెళ్లి కొడుకు అవాక్కయ్యాడు. చుట్టూ ఉన్న వారు సింధూరం దిద్దిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూసిన వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయారు.
 
ఈ పని చేసిన వ్యక్తిని రామాశిష్‌గా గుర్తించారు. వధువు గ్రామానికి చెందిన రామాశిష్ ఆమెను ప్రేమిస్తున్నాడు. పెళ్లి ఆగిపోవడం కోసమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తమ కుమార్తెను ఏడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, అతడి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments