Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి అభివృద్ధికి శ్రీవారి నిధులా... పట్టణవాసుల్లో మిశ్రమ స్పందన

తిరుపతి నగర అభివృద్థికి తితిదే రూ.188 కోట్ల నిధులు కేటాయించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించే వారు చేస్తున్న వాదనలోనూ ఇ

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (16:33 IST)
తిరుపతి నగర అభివృద్థికి తితిదే రూ.188 కోట్ల నిధులు కేటాయించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించే వారు చేస్తున్న వాదనలోనూ ఇంతో కొంత ఔచిత్యం లేకపోలేదు. ప్రభుత్వం తన బాధ్యతలను తితిదేపై మోపుతోందన్నది వారి ప్రధాన విమర్శ.
 
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల మాత్రమే కాదు. తిరుపతి కూడా. తిరుమలను ఎలా అభివృద్థి చేశామో.. తిరుపతి నగరాన్ని అంతే సుందరంగా తీర్చిదిద్దాలి. ఇందుకు రూ.188 కోట్లు కేటాయిస్తున్నాం. దీనికి ఎవరూ అడ్డుపడొద్దు. గతంలో చెరువుల అభివృద్ధికి నిధులిస్తే ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆయన్ను కూడా కోరాం. కేసు వెనక్కి తీసుకోమని అడిగాం. అందుకు అంగీకరించారు. తిరుపతి నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించండి. ఇవీ 1.11.2016 నాటి సమావేశంలో తితిదే పాలక మండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి చెప్పిన మాటలు. ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు వచ్చిన సందర్భంగానూ తిరుపతి అభివృద్ధిపై సూచనలు చేశారని ఇందులో భాగంగానే నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
 
రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన మార్పు కనిపిస్తోంది. నగర అభివృద్ధికి తితిదే నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందులోభాగంగానే మున్సిపాలిటీకి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.42 కోట్ల నిధులను తితిదే ఇటీవల చెల్లించింది. అదేవిధంగా తిరుపతిలోని చెరువులను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తితిదేకి అప్పగించింది. ఇందులోభాగంగానే అవిలాల చెరువులో పనులు చేపట్టారు. జిల్లాలోని 100 చెరువుల దాకా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే దీనిపై తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తితిదే వెనక్కి తగ్గింది. అవిలాల చెరువు వరకు పరిమితమై పనులు చేస్తోంది.
 
తిరుపతి నగరానికి రోజూ 60 వేల నుంచి లక్ష మంది శ్రీవారి భక్తులు వస్తుంటారు. వీరందరికీ మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపైన ఎంత ఉందో తితిదేపైనా అంతే ఉంది. నిధులు తితిదేకి, ఖర్చు మున్సిపాలిటీకి అంటే భావ్యం కాదు. ఈ దృష్టితోనే ఒకప్పుడు తిరుపతిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం తితిదే నిధులు కేటాయిస్తే అప్పట్లో కొందరు కోర్టుకెక్కారు. ఇప్పుడు మరోసారి తితిదే నిధుల అంశం చర్చనీయాంశంగా మారుతోంది. శ్రీవారి నిధులను నగర అభివృద్ధికి ఖర్చు చేయవచ్చా లేదా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తితిదేలో పనిచేసే 20 వేలు పైచిలుకు ఉద్యోగుల్లో ఎక్కువ భాగం తిరుపతి నగరంలోనే నివసిస్తున్నారు. అంటే 20 వేల కుటుంబాలు తితిదేవి ఉన్నాయన్నమాట. ఇక రోజువారి వచ్చే యాత్రికుల సంఖ్య 60 వేలు పైబడుతోంది. ఈ నేపథ్యంలో వీరికి అవసరమైన రోడ్లు, మంచినీళ్ళు, విద్యుత్‌ దీపాలు వంటి సదుపాయాలు తితిదే కల్పించడంలో తప్పులేదు. సామాజిక కార్యక్రమాల్లోనూ తితిదే చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటివి విస్తరించాలి. మొదట్లో ఈ అంశాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చి పనిచేసినా ఆ తర్వాత చాలా కాలంగా తితిదే పెద్దగా పట్టించుకోలేదు.
 
ఇటీవలే దానిపై దృష్టి పెట్టింది. బర్డ్ ఆసుపత్రిని రూ.40 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. స్విమ్స్‌కు, యూనివర్సిటీలకు ఇచ్చే నిధులు పెంచింది. నగరంలోని 9 రోడ్లను తితిదేనే నిర్వహిస్తోంది. ఇలా తిరుపతి నగర అభివృద్ధికి తితిదే నిధులు ఖర్చు చేయడాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు తితిదే నిధులు అదనంగా ఉండాలే తప్ప పూర్తిగా భారమంతా తితిదేపైన మోపి, ప్రభుత్వం తప్పించుకోవాలంటే ఆమోద యోగ్యం కాదు. ఇప్పుడు తితిదే నిధులు నగరాభివృద్ధికి వెచ్చించడాన్ని తప్పుబడుతున్న వారు చేస్తున్న ప్రధానమైన ఆవేదన ఇదే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments