Webdunia - Bharat's app for daily news and videos

Install App

తట్టాబుట్టా సర్దుకున్న టిటిడి ఛైర్మన్ - ఎందుకు? ఏం చేశారు?

ప్రస్తుత టీటీడీ పాలక మండలలి పదవీకాలం ముగిసింది. మంగళవారం చివరిసారిగా సమావేశం అయ్యారు బోర్డు సభ్యలు. మొదట్లో ఏడాదిగా పాలక మండలి నియమించినా తర్వాత మరో ఏడాది పదవీకాలం పొడిగించింది ప్రభుత్వం. రెండేళ్లు వ్యవధిలో టీటీడీ బోర్డు టీటీడీ వ్వహాలరాలపై పెద్దగా చర

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (22:14 IST)
ప్రస్తుత టీటీడీ పాలక మండలలి పదవీకాలం ముగిసింది. మంగళవారం చివరిసారిగా సమావేశం అయ్యారు బోర్డు సభ్యలు. మొదట్లో ఏడాదిగా పాలక మండలి నియమించినా తర్వాత మరో ఏడాది పదవీకాలం పొడిగించింది ప్రభుత్వం. రెండేళ్లు వ్యవధిలో టీటీడీ బోర్డు టీటీడీ వ్వహాలరాలపై పెద్దగా చర్చించిగాని.. ఏళ్లతరబడి ఉన్న సమస్యలపై దృష్టిచూపిన సందర్భాలు కానీ లేవు. కేవలం అధికారుల నిర్ణాయానికి ఆమోదముద్ర వేయడం కోసం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి మమ అనిపించారన్న ఆరోపణలున్నాయి.
 
ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవులు దక్కడం అంటే ఆషామాషీ కాదు. మంత్రి పదవులు తర్వాత ప్రముఖులందరు చూపు ఉండేది టీటీడీ బోర్డులో చోటుకోసమే. మరి అంతటి ప్రాధాన్యమున్న పాలకమండలి పదవీకాలం పూర్తిచేసుకుంది ప్రస్తుతం పాలకమండలి. బాపిరాజు అధ్యక్షతలోని బోర్డు తర్వాత అధికారుల పాలనలోనే కొన్నాళ్లు గడిచిన టీడీపీ నూతన ప్రభుత్వం పాలక మండలిని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డ చదలవాడు కృష్ణమూర్తికి ఇచ్చిన హామీ మేరకు ఆయనకు టీటీడీ బోర్డు అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. మిగతా జిల్లాల్లోని టీడీపీ ఆశావహులను బోర్డు సభ్యలుగా నియమించారు. మొదట్లో ఏడాది కాలమే బోర్డు పదవీకాలం అని చెప్పినా తర్వాత మరో ఏడాది కూడా అదేబోర్డును కొనసాగించారు. 
 
మొత్తం మీద రెండేళ్లు పదవీకాలం పూర్తిచేసుకున్న ప్రస్తుత బోర్డు ఈ రెండేళ్లలో భక్తులకు చేసింది ఏమిటి అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదనే చెప్పాలి. ప్రభుత్వ ఆదేశలను తూచా తప్పకుండా పాటించడం, టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాలకు స్టాంపుముద్ర వేడడం తప్ప టీటీడీ బోర్డు ఇటు టీటీడీ అభివృద్ధికిగానీ అటు భక్తులకు ఒరగబెట్టిందేమీ లేదనే చెప్పుకోవాలి.
 
టీటీడీ బోర్డు రెండేళ్ల క్రితం కొలువు తీరినప్పుడు అనేక సవాళ్లు స్వాగతం పలికాయి. తిరుపతి తిరుమల స్ధానికుల సమస్యలతోపాటూ, టీటీడీలో పనిచేస్తున్న 13 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇబ్బందులు తీరుతాయని భావించారంతా. పైగా బోర్డు చైర్మెన్ పదవితోపాటూ మరో ఇద్దురు సభ్యలు కూడా తిరుపతికి చెందినవారే కావడంతో వారిపై ఆశలు పెట్టుకున్నారు స్ధానికులు. కొండపైన ఆలయ విస్తరణ కోసం తమ ఇళ్లు పోగొట్టుకున్న నిర్వాసితులకు దశాబ్దకాలం గడిచినా న్యాయం కలగడం లేదు. వీరిలో 120 మందికి తిరుమలలో దుకాణాలు కేటాయిస్తామన్న హామీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఎన్నిసార్లు టీటీడీ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం కపడటం లేదు. 
 
ఇక అతిపెద్ద ధార్మిక వ్యవస్థ అయిన టీటీడీలో ఇప్పటికీ 7 వేల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అధికారంలోకి రాగానే ఫిలప్ చేస్తామాని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు. టీటీడీలో 13,500 మంది కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి జీతం మాత్రం 7వేల లోపే ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 151 జీవో ప్రకారం కనీస వేతనం 12 వేలు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. టీటీడీ ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకుందే తప్ప చేసిందేమీలేదు.
 
అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాల అంశం కోర్డులోనే నానుతున్నా టీటీడీ బోర్డు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈవో ఆధ్వర్యంలో ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై కమీటీ వేస్తాం అన్న బోర్డు నిర్ణయం ఇప్పటిదాకా అమలుకాలేదు. గతంలో బోర్డు సమావేశాలంటే వాడీవేడి చర్చలు జరిగేవి. ప్రధానంగా భక్తుల సమస్యలపై సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ప్రస్తుత పాలక మండలి సమావేశాలు మాత్రం ఏదో జరగాయంటే జరిగాయి అన్న చందంగానే నిర్విహించారన్న వాదనలున్నాయి. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలపై పెద్దగా చర్చించిన దాఖలాలు అసలే లేవు. ప్రస్తుత బోర్డు ఉద్దరించిందల్లా టీటీడీ సేవాటికెట్లు, దర్శనాలు, రూముల ధరలు పెంచకపోవడం మాత్రమేనని చెప్పుకోవచ్చు. 
 
స్వయం ప్రతిపత్తితో సొంత నిర్ణయాలు తీసుకే అధికారం ఉన్నా టీటీడీ బోర్డు మాత్రం రెండేళ్ల కాలం పాటూ అచేతనంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడం, టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడానికే బోర్డు సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు మంచినీళ్లప్రాయంగా సమర్పించుకుంటూ వచ్చింది. ప్రైవేటు సంస్థలకు నిధులిచ్చిన అంశాల్లో కొన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు వేసున్న పరిస్థితీ ఏర్పడింది. మొత్తంమీద రెండేళ్ల పాటూ పదవుల్ని వెలగబెట్టిన వారు భక్తులకు చేయాల్సింది అటుంచితే తాము మాత్రం టీటీడీ అందించే సకల సౌకర్యాలు అనుభవిచడంతో పాటూ తమవారందరికీ కొదవ లేకుండా దర్శన టికెట్లు ఇప్పించుకున్నారు. గోవిందుడిని తనివితీరా దర్శించుకుని ఆ విధంగా ముందుకు వెళ్లారు.
 
ఇదంతా పక్కనబెడితే పదవీకాలం ముగియడంతో చదలవాడ క్రిష్ణమూర్తితో పాటు సభ్యులు తట్టాబుట్టా సర్ధుకుని సిద్థంగా ఉన్నారు. ఇక మిగిలింది 3 రోజులే కాబట్టి వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చేశారు. అయితే మరోసారి పదవిని పొడిగిస్తారన్న ఆశలో కూడా పాలకమండలి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పొడిగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments