Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రైలు మిస్సయ్యిందా.. ఏం ఫర్వాలేదు...!

రైలు మిస్సయితే ఏం ఫర్వాలేదు అని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? గతంలో రైలు మిస్సయ్యితే ఇక టిక్కెట్ డబ్బులు కాస్త గోవిందా.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఒక మార్పును తీస

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:10 IST)
రైలు మిస్సయితే ఏం ఫర్వాలేదు అని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? గతంలో రైలు మిస్సయ్యితే ఇక టిక్కెట్ డబ్బులు కాస్త గోవిందా.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఒక మార్పును తీసుకొచ్చింది. అదేంటో చదవండి. 
 
ఇకపై అదే టికెట్‌తో అదే గమ్యానికి వెళ్ళే ఏ రైలైనా ఎక్కొచ్చు ఒకే గమ్యానికి వెళ్లే ఏ రైలులోనైనా సాధారణ టికెట్‌తో కూడా ప్రయాణించొచ్చని భారతీయ రైల్వే పేర్కొంది. 'వికల్ప్‌' పథకం ద్వారా పాసింజర్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణీకులు రైలు మిస్‌ అయితే తర్వాత అదే మార్గంలో అందుబాటులో ఉన్న ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని వెల్లడించింది. 
 
రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ, స్పెషల్‌ రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇలా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను వినియోగించుకున్నందుకు పాసింజర్ల నుంచి ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలు వసూలు చేయబోమని దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. 
 
ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ప్రయాణీకులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్‌ వెయిటింగ్‌ లిస్టులో ఉన్న పాసింజర్లు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించొచ్చని వివరించింది. 
 
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలో 'వికల్ప్‌' స్కీంను ఎంచుకోవాలని చెప్పింది. దీంతో టికెట్లు వెయిటింగ్‌ లిస్టులో ఉంటే అదే సమయానికి ఖాళీగా ఉండే రైలు వివరాలు సదరు వ్యక్తి మొబైల్‌కు ముందుగానే వస్తాయని తెలిపింది. కాగా, ఫ్లెక్సీ ఫేర్‌ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్‌ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. 
 
రైల్వే తాజా నిర్ణయంతో లక్షలాది ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. మరింత సమాచారం కోసం కొన్ని నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments