Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నటివరకూ రజినీకాంత్ వెనుకే... ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నారా?

రజినీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ముఖ్యంగా తన పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలుపడంతో ఇప్పటికే పాతుకుపోయి వున్న రాజకీయ పార్టీలు నొసలు ఎగురవేశాయి. ఇది

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (10:10 IST)
రజినీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ముఖ్యంగా తన పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలుపడంతో ఇప్పటికే పాతుకుపోయి వున్న రాజకీయ పార్టీలు నొసలు ఎగురవేశాయి. ఇదిలావుంటే రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఆయన్ని హీరోగా పెట్టి చిత్రాలు చేసిన దర్శకులు కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం పైన తమిళుడు మాత్రమే కూచుంటాడని గట్టిగా వాదిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ... రజినీకాంత్‌కు తను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. తను ఓ తమిళుడికి మాత్రమే ఓటు వేస్తానని వెల్లడించారు. 
 
ఐతే తను రజినీకాంత్‌కు పెద్ద అభిమానిననీ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంతేనని పేర్కొన్నారు. ఓ నటుడిగా తను రజినీకాంత్‌ను ఎంతగానో ఆదరిస్తాననీ, కానీ రాజకీయాల్లో మాత్రం పూర్తిగా తిరస్కరిస్తానని వెల్లడించారు. కాగా మరికొందరు తమిళ దర్శకులు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేయడం గమనార్హం. మరి వీరికి రజినీకాంత్ ఎలాంటి సమాధానం చెపుతారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments