Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూకు అసలు టిక్కెట్ ఇస్తారా...? ఇస్తే చిత్తుగా ఓడిస్తాం అంటోన్న కాంగీయులు... ప్చ్ వాళ్లంతే...

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ చూరు పట్టుకుని వేళాడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. అదలావుంటే సినీ నటి ఖుష్బూ చాలా రోజుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2016 (20:02 IST)
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ చూరు పట్టుకుని వేళాడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. అదలావుంటే సినీ నటి ఖుష్బూ చాలా రోజుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పైన పోటీ చేసేందుకు తనకు ఎంతో ఆసక్తి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కూడా సర్లే అని అప్పట్లో చెప్పేసింది. కానీ హఠాత్తుగా సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. 
 
అసలు ఖుష్బూకు సీటు దక్కుతుందో లేదో తెలియని స్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఖుష్బూ ఉవ్విళ్లూరుతుండగా డీఎంకే చీఫ్ కరుణానిధి ఆమె ఆశల పైన నీళ్లు చల్లేశారు. అక్కడి నుంచి డీఎంకే అభ్యర్థిగా సిమ్లా ముత్తుచోళన్‌ను పోటీకి దింపుతున్నట్లు ప్రకటించారు. 
 
అది పోతేపోనీ కనీసం మైలాపూర్ నుంచి పోటీ చేద్దామని అనుకుంటుంటే... అక్కడ కనుక ఖుష్బూకు సీటు ఇస్తే ఆమెను చిత్తుచిత్తుగా ఓడించడంలో తామే ముందుంటామని కాంగ్రెస్ పార్టీ వర్గీయులే అంటున్నారట. దీనితో ఏం చేయాలో తోచక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలబట్టుకుంటే ఖుష్బూ మాత్రం తనకు అసలు టిక్కెట్ ఇస్తారో లేదో అని గాభరా పడుతోందట. అంతే... తమిళ రాజకీయాలు చాలా హాట్ గురూ...

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments