Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇద్దరు ఎస్పీలు, 10 మందికి పైగా డిఎస్పీలు హస్తం...?!

తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపడితే ఇంటి దొంగలే బయటపడుతున్నారు. అది కూడా క్రిందిస్థాయి సిబ్బంది కాదు పోలీస్‌ ఉన్నతాధికారులే. తమ చేతిలో అధికారాలు లేకపోవడంతో నేరుగా ఒక నివేదికను ప్రభుత్వానికి ప

Webdunia
గురువారం, 7 జులై 2016 (14:13 IST)
తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపడితే ఇంటి దొంగలే బయటపడుతున్నారు. అది కూడా క్రిందిస్థాయి సిబ్బంది కాదు పోలీస్‌ ఉన్నతాధికారులే. తమ చేతిలో అధికారాలు లేకపోవడంతో నేరుగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమవుతున్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు.
 
శేషాచలం అడవులు. ఎంతో అరుదైన వృక్ష సంపద ఈ ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అరుదైన ఎర్రచందనం దుంగలు ఈ ప్రాంతంలోనే లభిస్తున్నాయి. అయితే ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యులు కూడా చాలామందే ఉన్నారు. సులువుగా లక్షలు సంపాందించే మార్గం ఏదైనా ఉందంటే అది ఎర్రచందనమేనని తేలడంతో వారు వాటి కోసం తపిస్తుంటారు.
 
ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి నిరుద్యోగులే ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఎంతమంది తమిళీయులను పోలీసులు పట్టుకున్నా వారు మాత్రం వెనక్కి తగ్గరు. ఎందుకంటే పోతే గోరు పోతుంది... లేకుంటే కొండ వస్తుందన్నది వారి నమ్మకం. అంటే పోతే కొన్ని రోజులు స్టేషన్‌కు... లేదంటే లక్షల్లో ఎర్రచందనం దుంగలు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా, కుటుంబ సభ్యులు ఏడ్చి గోలపెట్టినా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను మాత్రం ఆపరు.
 
అందుకే శేషాచలంలోని అరుదైన ఎర్రచందనం చెట్లు ఇప్పటికే దాదాపు సగానికిపైగా నరికేసి విదేశాలకు తరలించేశారు, చేస్తున్నారు. ఎపి ప్రభుత్వం (తెదేపా) అధికారంలోకి వచ్చిన తరువాత ఎర్రచందనంపై ప్రత్యేక దృష్టి సారించింది. అరుదైన వృక్ష సంపదను కాపాడాలన్న ఉద్దేశంతో స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడే ఒక ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. అదే టాస్క్ ఫోర్స్. ఒక డిఐజి స్థాయి అధికారితో పాటు కొంతమంది సిబ్బందిని ఇందులో నియమించారు. అయితే అందరికీ ఆయుధాలు లేవు. దీంతో వీరు అడవుల్లోకి వెళ్ళి ఎర్రచందనం దొంగలను పట్టుకోవాలని ప్రయత్నించినా వారు సులువుగా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. అంతే కాదు దాడులకు దిగి టాస్క్ ఫోర్స్ సిబ్బందిని గాయపరిచేస్తున్నారు.
 
దీంతో టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం కొత్త పోలీస్టేషన్‌నే తిరుపతిలో ఏర్పాటు చేసింది. అలిపిరిలోని కపిలతీర్థం ఉన్న అటవీశాఖ కార్యాలయం వద్దనే ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్‌‌ను ఏర్పాటు చేశారు. గత రెండు నెలల క్రితం టాస్క్‌‌ఫోర్స్ సిబ్బంది కొంతమంది ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. అయితే అందులో కొందరు మీ పోలీసులే మాకు సహకరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దొంగలను నాలుగు గట్టిగా పీకితే వారి పేర్లు కూడా చెప్పేశారట.
 
ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు, 10 మందికి పైగా డిఎస్పీ స్థాయి అధికారులు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ కదలికలతో పాటు, వారు కూంబింగ్‌ వెళ్లే విషయాలను ఎర్రచందనం దొంగలకు ఇంటిదొంగలు చేరవేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తమ వాహనాల వెనుక లారీలను తీసుకువచ్చి చెక్‌ పోస్టుల మీదుగా దగ్గరుండి దాటిస్తున్నట్లు సమాచారం. ఇలా ఈ ఉన్నతాధికారులు లక్షల్లోనే ఆదాయాన్ని సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది.
 
విచారణ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసు అధికారుల పేర్లతో పాటు వారు ఎంత సంపాదించారన్న నివేదికను కూడా ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతోంది టాస్క్ ఫోర్స్. ఇప్పటికే తిరుపతిలో ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీస్టేషన్‌ బాధ్యతలను చేపట్టారు. వీరు త్వరలో విజయవాడకు వెళ్ళి చంద్రబాబుకు నివేదికను అందించనున్నట్లు సమాచారం. మొత్తంమీద ఈ ఇంటిదొంగలపై సిఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments