Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చిరంజీవి రాజకీయ అనుభవాలు... ఫ్యాన్స్‌తో మళ్లీమళ్లీ భేటీ...

నటులు రాజకీయాల్లో రాణించడం అంటే అది ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితకే సరిపోయిందంటారు చాలామంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటూ ఏలేసిన చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ఎలా అభాసుపాలయ్యారన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన తమ్ముడు జనసేన పార్టీతో రాష

Webdunia
సోమవారం, 22 మే 2017 (12:24 IST)
నటులు రాజకీయాల్లో రాణించడం అంటే అది ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితకే సరిపోయిందంటారు చాలామంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటూ ఏలేసిన చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ఎలా అభాసుపాలయ్యారన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన తమ్ముడు జనసేన పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన పార్టీని అప్పుడే ఆయన వైరి వర్గం సెటైర్లతో ముంచెత్తుతోంది. జనసేన పార్టీ తీరం దాటలేని తుఫాన్ అంటూ భలేగా అభివర్ణించేస్తూ తమాషా చేస్తుంది. 
 
ఇక ఇప్పుడు తమిళనాడులో రజినీకాంత్ వంతు వచ్చింది. జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే ఎన్నోమార్లు రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చారు రజినీకాంత్. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు. భాజపా ఒకవైపు తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతుంటే మరోవైపు రజినీకాంత్ మాత్రం తన అభిమానుల అభిప్రాయం మేరకే నడుచుకోవాలని వారితో భేటీలపై భేటీలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే... మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విషయం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో చిరంజీవి రాజకీయాల్లో అనుభవాల గురించి రజినీకాంత్ వాకబు చేసినట్లు సమాచారం. ఆయన పార్టీ పెట్టి ఎందుకు అలా అయిపోయిందన్న దానిపై ఆయన లోతుగా పరిశీలన చేసినట్లు చెప్పుకుంటున్నారు. తమిళనాడులో తను కూడా ఒకవేళ పార్టీ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై ఆయన తన అభిమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తమ్మీద తమిళనాడులో స్వచ్ఛమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని రజినీకాంత్ భావిస్తున్నారట. ఈ విషయంలో అవసరమైతే కమల్ హాసన్ సహకారం తీసుకోవాలని కూడా అనుకుంటున్నారట. రజినీకాంత్ పార్టీ స్థాపించే విషయంలో బాగా కసరత్తు చేస్తున్నట్లు కనిపించడంలేదూ...?!!

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments