మొదట 21 రోజులు.. ఇపుడు 19 రోజుల లాక్‌డౌన్.. 'మండల దీక్ష' అస్త్రంతో మోడీ వ్యూహం

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (11:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. మే 3వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమల్లోవుంటుందని ఆయన మంగళవారం ఉదయం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో తొలి కరోనా కేసు నమోదైన వెంటనే అప్రమత్తమైన కేంద్రం.. ఆ తర్వాత ముందుచూపుతో అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగానే లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఫలితంగానే ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం ఎంతో సురక్షితంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేసులు పెరిగాయి. ఈ కేసుల సంఖ్య రోజుకు 7 నుంచి 8 శాతం మేరకు పెరుగుతూ, ప్రస్తుతం 10 వేలకు పైగా నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, లాక్ డౌన్ పొడిగించాలన్న వినతులు వచ్చాయి. దీంతో ఆయన సైతం కరోనా కట్టడికి నిబంధనల కొనసాగింపే మంచిదన్న ఉద్దేశానికి వచ్చారు.
 
ఇక అటు రెండు వారాలు కాకుండా, ఇటు మూడు వారాలు కాకుండా, మధ్యలో 19 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని మోడీ ప్రకటించడం వెనుక, ఆయన చాలా పెద్ద ఆలోచనే చేశారని భావించవచ్చు. 21కి 19 కలిపితే 40 వస్తుంది. అంటే 'మండలం'... భారతదేశంలో మండల దీక్షకు ఎంతో విలువ ఉంది. 
 
ప్రతియేటా కోట్లాది మంది అయ్యప్ప భక్తులు మండల దీక్ష పాటించి, యాత్ర చేస్తుంటారు. జైనులు కూడా మండల దీక్ష చేస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలు మండలం రోజులు కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో మండలం రోజుల లాక్‌డౌన్, ప్రజల్లో నిబంధనల సెంటిమెంట్‌ను నిలిపివుంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
కరోనా కట్టడి కావాలంటే, మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే, లాక్‌డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోడీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్‌ను మోడీ ప్రయోగించారని ఆధ్యాత్మిక గురువులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

తర్వాతి కథనం
Show comments