Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం కావాలనుకుంటున్నారా? రూ.200 కోట్ల ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారు?

కాకినాడ, తిరుపతి బహిరంగ సభల్లోనే కాకుండా ప్రెస్ మీట్‌లలోనూ తన వద్ద డబ్బుల్లేవని అందుకే సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కాలుపెట్టి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యా

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:58 IST)
కాకినాడ, తిరుపతి బహిరంగ సభల్లోనే కాకుండా ప్రెస్ మీట్‌లలోనూ తన వద్ద డబ్బుల్లేవని అందుకే సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కాలుపెట్టి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించడం మానేస్తే.. తన వద్ద డబ్బుల్లేవని, మీరే నన్ను పోషించాలి. నన్ను సినిమాలు మానేయమంటారా? అంటూ పవన్ కల్యాణ్ పదే పదే చెప్పడంతో.. ఆయన పార్టీ కోసం ఓ వ్యాపారవేత్త రూ. 200 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చాడని తెలిసింది. ఏపీకి చెందిన ఓ వ్యాపార వేత్త రూ.200 కోట్ల రూపాయలు ఇస్తాను.
పార్టీని నువ్వే నడిపించు అంటూ రాయబారం పంపినా... పవన్ సున్నితంగా తిరస్కరించి..ఎంత కష్టమైనా తన కష్టార్జితంకోనే పార్టీని నడిపిస్తానని పవన్ కల్యాణ్ సమాధానమిచ్చాడని తెలిసింది. ఈ కథనంలో వాస్తవం ఎంతో గానీ ఆఫర్ మాత్రం అదిరిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ ఏపీ సీఎం కావాలనుకుంటున్నారని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ విమర్శించారు. సీఎం కావాలనే కోరికతోనే పవన్ కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సిద్ధార్థనాథ్ సింగ్ ఆరోపించారు. కాకినాడ సభలో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే, బీజేపీ పొట్టలో పొడిచిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటే పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చిందని పవన్ విమర్శించడాన్ని బీజేపీ తిప్పికొట్టింది. అలాగే ఏపీలో బీజేపీ కథ ముగిసిందని.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే ఏపీలో బీజేపీ సర్వనాశనం చేసేశారని.. అది ఇక ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితిలోకి పడిపోయిందని పవన్ తేల్చేశారు. దీనిపై కూడా బీజేపీ సీరియస్ అయ్యింది. వెంకయ్యనాయుడుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని సిద్ధార్థనాథ్ సింగ్ డిమాండ్‌ చేశారు.
 
సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను బట్టి.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిలా పవన్ కల్యాణ్ కూడా సీఎం కావాలనే కోరికతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీని బలోపేతం చేసి టీడీపీ-బీజేపీలను పక్కకు నెట్టి.. తమ పార్టీ జెండాను పైచేయిగా తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా అస్త్రంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ప్యాకేజీ ఇచ్చినా హోదా కోసం పట్టుబడుతున్నారు. ఇదంతా చూస్తే.. తమ్ముడికి కూడా అన్నయ్యలా సీఎం కావాలనే  కోరిక ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి పవన్ ప్లాన్ ఏంటో తెలియాలంటే.. 2019 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments