సీఎం జగన్‌ని అలా టార్గెట్ చేయమని పిలుపునిచ్చిన జనసేనాని..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:11 IST)
100 రోజులు. కొత్త ప్రభుత్వం. ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. అస్తవ్యస్థ పాలన. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేయండి..జనసైనికులను సిద్థం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
 
అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పూర్తిస్థాయిలో తెలియని ముఖ్యమంత్రి జగన్. కనీసం అనుభవం ఉన్న వారినైనా తెలుసుకుని పరిపాలన చేయాలి. అదీ చేయడం లేదు. ఇక ఉపేక్షించొద్దు. మన టార్గెట్ జగన్. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి. ప్రజల్లో చైతన్యం తీసుకురండి..అయితే మన పర్యటనలో జనసమీకరణలు అవసరం లేదు. 
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మనము వెళుతున్నాం. ఆర్భాటం మనకు అస్సలు అవసరం లేదు. త్వరలో ఎపిలోని 175స్థానాల్లో నేను పర్యటిస్తాను. ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటాను. రైతులు, నిరుపేదలు పడుతున్న కష్టాలు నా దృష్టికి వచ్చాయి. వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతామంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసైనికులు పోరాటానికి సిద్థం చేయాలని పార్టీ శ్రేణులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు పెళ్లని ఎవరు చెప్పారు.. వదంతులు భలే పుట్టిస్తారబ్బా : మీనాక్షి చౌదరి

Jana Nayakudu: జననాయకుడు ఎఫెక్ట్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న భగవంత్ కేసరి.. ఎలా?

క్షమించండి రాశిగారు, నేను ఆ మాట అనడం తప్పే: యాంకర్ అనసూయ

Akhil: లెనిన్ నుంచి అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే పై రొమాంటిక్ సాంగ్

ముంబైలో ప్రభాస్... రాజా సాబ్ నుంచి నాచె నాచె.. సాంగ్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments