Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఎన్నికల్లో దిగితే ఎన్ని స్థానాలు గెలుస్తుందో తెలుసా..!

2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినా పోటీకి దిగలేదు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుతో సరిపెట్టుకుంది. అయితే, 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (11:17 IST)
2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినా పోటీకి దిగలేదు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుతో సరిపెట్టుకుంది. అయితే, 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇంతకీ ఆపార్టీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా ఇప్పుడున్న అధికార, ప్రతిపక్షాలతో జతకట్టి ఏదో కూటమిలో చేరి కొన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందాన్నది ఇప్పట్లో తేలేదికాదు. అయితే, ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేనకు 57 నుంచి 62 స్థానాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటే ఇదే విషయాన్ని ఆ పార్టీ అధికారప్రతినిధి సుంకర కళ్యాణ్ దిలీప్ స్పష్టం చేశారు.
 
వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో, ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుపై ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. ఇప్పుడే విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదన్న ఉద్దేశ్యం ఆ పార్టీల్లో కనిపిస్తోంది. పవన్‌కు ఉన్న అభిమానమంతా ఓట్ల రూపంలోకి మారుతుందా అంటే, చెప్పలేని పరిస్థితి. అయితే, పవన్ ప్రభావం ఎంతో కొంత అయితే ఉంటుందన్నది స్పష్టం. ఆ పార్టీ ప్రతినిధి చెప్తున్న లెక్కలే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కింగ్‌మేకర్‌గా మారడం ఖాయం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments