Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసలిస్తే చాలు, దేనికైనా ఓకే... విశాఖలో పోలీస్ సివిల్ సెటిల్మెంట్లు

విశాఖ ‌: విశాఖ న‌గ‌రంలో పోలీసుల దందాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఏ చిన్న స‌మ‌స్య త‌మ దృష్టికి వ‌చ్చినా సెటిల్‌మెంట్ల‌కు తెగ‌బ‌డిపోతున్నారు. ఖాళీ స్థ‌లాలు, అదీ వివాదస్పద స్ధలాలైతే ఇక్కడి పోలీసులకు పండగే. ఉన్నతాధికారులకు బదిలీలకు సైతం బయపడని బర

Webdunia
బుధవారం, 13 జులై 2016 (12:56 IST)
విశాఖ ‌: విశాఖ న‌గ‌రంలో పోలీసుల దందాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఏ చిన్న స‌మ‌స్య త‌మ దృష్టికి వ‌చ్చినా సెటిల్‌మెంట్ల‌కు తెగ‌బ‌డిపోతున్నారు. ఖాళీ స్థ‌లాలు, అదీ వివాదస్పద స్ధలాలైతే ఇక్కడి పోలీసులకు పండగే. ఉన్నతాధికారులకు బదిలీలకు సైతం బయపడని బరితెగించిన పోలీసులు విశాఖ‌లో ఉన్నారు. సీపీ ఆఫీసు కేంద్రంగా తాజాగా ఒక భూ సెటిల్మెంట్ వివాదంలో ఆరిలోవ సీఐ బదిలీ అయ్యారు. ఇటువంటి వ్యవహారంలో 27మంది సీఐలపై కొరడా ఝుళిపించారు సీపీ యోగానంద్.
 
అయితే, సెటిల్మెంట్ ద్వారా భారీగా సంపాదించిన సీఐలు బదిలీలతో ఏ మాత్రం జంక‌డం లేదు. సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ ఆరిలోవ సీఐ ధనుంజయ నాయుడు అడ్డంగా బుక్ అయ్యారు. విశాఖలోని ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈయ‌పై అనేక పిర్యాదులు రావడంతో సీపీ అతనిని వీఆర్లో ఉంచారు. ధనుంజయనాయుడుని బదిలీ చేశారనే విషయం తెలుసుకొని ఆరిలోవ నుంచీ బాధితులు పెద్ద ఎత్తున సీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. 
 
సీఐ అక్రమాలను ఆధారాలతో సహా సీపీ ముందుంచారు. స్టేషన్ లో సెటిల్ మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చడం వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తనపై ఎదురు తిరిగిన వారిపై వారిని ఉసిగొలిపేవాడు..దీనితో ఈ సీఐ దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని విశాఖ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం