ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు.. ఎన్టీఆర్, సీఎం జగన్.. ఇంకా..?

Webdunia
శనివారం, 27 మే 2023 (14:23 IST)
NTR
బెజవాడలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పటమట సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
ఎన్టీఆర్‌కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ ఘటనపై స్పందించిన తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు. 
 
ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని దేవినేని అవినాష్ అన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నామని.. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన కూడా లేకుండా చేసేవారని ఫైర్ అయ్యారు. 
 
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నేత జగన్ అని గుర్తు చేశారు. తాము కూడా ఎన్టీఆర్ అభిమానులమేనని, ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం

Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

తర్వాతి కథనం
Show comments