Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కాదు.. ఇండియన్ సిటిజన్ కార్డు.. ఎన్డీయే ప్లాన్

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (11:54 IST)
ఆధార్ కార్డు లేకుంటే భవిష్యత్తులో కష్టమే, ఖచ్చితంగా ఆధార్‌ తీసుకోవాల్సిందే అంటూ యూపీఏ ప్రభుత్వం నానా హడావుడి చేసింది. ఆధార్‌ ప్రాజెక్టును విమర్శించిన బీజేపీ కూడా అదేదారిలో వెళ్తోంది. అయితే ఎన్డీయే ఆధార్‌ జోలికి వెళ్లటం లేదు. భారీ వ్యయంతో సరికొత్త పథకానికి రంగం రంగం సిద్ధం చేసింది.
 
ఇండియన్‌ సిటిజన్‌ కార్డులు
సిటిజన్‌ కార్డ్‌ పేరుతో అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు, టెక్నికల్‌ నిపుణులతో సమాలోచనలు జరిపిన కేంద్రం హోంశాఖ ప్రతి ఒక్కరికి ఇండియన్‌ సిటిజన్‌ కార్డులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా రూ.4 వేల కోట్లకు పై మాటే. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరు భారతీయులో ఎవరు కాదో తెలిసిపోతుందని హోంశాఖ భావిస్తోంది. 2009లో నిర్వహించిన పైలెట్‌ సర్వేలో భారత్‌కు వలసొచ్చిన వారు లెక్కకు మించి ఉన్నారని తేలింది. వీరందరికి సరైన అనుమతులు, గుర్తింపు లేకున్నా భారత్‌లో అక్రమంగా నివాసం ఉంటున్నారని తేలింది. 
 
ఆధార్‌ను విమర్శించిన బీజేపీ 
కేంద్రం పగ్గాలు చేపట్టిన ప్రతి పార్టీ ఏదో ఒక పథకం పై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. యూపీఏ ప్రభుత్వం అదే కోవలో ఆధార్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో విమర్శలు మూటకట్టుకుంది. అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత పాలకపక్షం బీజేపీ సైతం ఆధార్‌ ప్రాజెక్టును తూర్పారబట్టింది. భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారంటూ యూపీఏపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
 
సిటిజన్‌ కార్డులతో మేలు...?
అనుమతి లేకుండా నివాసముంటున్న వారితోనే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. సమగ్ర సర్వే చేసి, వివరాలు అమూలాగ్రం పరిశీలించి గుర్తింపు కార్డులు ఇస్తేఎవరు ఎక్కడి వారో తెలిసిపోతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ కాక అందరి వివరాలు ఓ డేటాబేస్‌లో భద్రపరిస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుందనేది హోం శాఖ ఆలోచన. ఇప్పటికే ఆధార్‌ పేరుతో యూపీఏ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మళ్లీ ఎన్డీయే చేపట్టనున్న ఈ ఇండియన్‌ సిటిజన్‌ కార్డుల ప్రాజెక్టు అయినా లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?