Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ దిశగా నాగం జనార్ధన్ రెడ్డి అడుగులు.. చేర్చుకోకుంటే కొత్త పార్టీ!

Webdunia
ఆదివారం, 15 మే 2016 (16:41 IST)
కాంగ్రెస్ పార్టీ దిశగా సీనియర్‌ నేత నాగం జనార్థన్‌రెడ్డి అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అక్కడ ఎంట్రీ లేకుంటే మాత్రం మరో కొత్త పార్టీని స్థాపించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కంటే కూడా నాగం జనార్థన్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపైనే తీవ్ర చర్చ సాగుతోంది. 
 
ఒకప్పుడు టీడీపీలో ఉజ్వలంగా వెలిగిన నాగం జనార్థన్‌ రెడ్డి 'ప్రభ' ఇపుడు ఆరిపోయే దీపంలా మారింది. బీజేపీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ.. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన చూపు కాంగ్రెస్‌ వైపు మరలినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో ఆయన కనిపిస్తుండటం, నాగం ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం వంటి అంశాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
 
నిజానికి టీడీపీలో ఉన్నపుడు లేదా సొంతగా తెలంగాణ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ, కమలం పార్టీలోకి వచ్చాక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. నాలుగేళ్లబట్టి బీజేపీలో ఉంటున్నా నాగంకి ఎలాంటి పదవీ లభించకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలకి నాగం శ్రీకారం చుట్టారు. 
 
ఈ తరుణంలోనే ఆయన దృష్టి కాంగ్రెస్‌ పార్టీవైపు మళ్లినట్టుగా సమాచారం. అప్పటికే తమ పార్టీలోకి నాగం వస్తే బాగుండునని కాంగ్రెస్‌ ముఖ్యనేతల అభిప్రాయంగా ఉంది. ఎప్పుడైతే నాగం నుంచి సానుకూల సంకేతాలు కనిపించాయో.. ఆ వెంటనే జైపాల్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి రంగంలోకి వచ్చారు. తరచూ నాగంతో వారు భేటీ అవుతూ "కాంగ్రెస్‌లో ఆయనకు తగిన స్థానం, గుర్తింపు ఉండేలా చూస్తాం" అంటూ హామీ ఇచ్చారట. ఈ ముచ్చట్ల సంగతి కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారట. పార్టీ పెద్దలు కూడా నాగం రాకకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలా లేక సొంత కుంపటి పెట్టుకోవాలా అనే అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్నారట. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments