Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురంధరేశ్వరి ఏం చెప్పారు...? నవ్వుతూ వచ్చిన ఎమ్మెల్యే రోజా...

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు.. నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్న చందంతో ముందుకెళుతున్నారు రోజా. ఆమె నోరు తెరిస్తే ఇక అధికారపార్టీ నాయకులు చెవులు మూసుకోవాల్సిం

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (14:40 IST)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు.. నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్న చందంతో ముందుకెళుతున్నారు రోజా. ఆమె నోరు తెరిస్తే ఇక అధికారపార్టీ నాయకులు చెవులు మూసుకోవాల్సిందే. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే రోజా ప్రస్తుతం వైకాపాలో నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రోజా వాగ్ధాటికి ఎవరూ నిలవలేరన్న విషయం స్వయంగా జగన్‌కే తెలుసు. అందుకే పార్టీలోకి ఎవరిని పిలవాలన్నా స్వయంగా రోజానే జగన్ రంగంలోకి దింపుతున్నారట. కారణం.. అయితే ఆర్కాట్.. లేదా వాలాజా.. తమిళంలో ఇది ఒక సామెత. దానర్థం..అయితే అవుతుంది..లేదంటే లేదని..అలా రోజా వ్యవహరిస్తారు కాబట్టి.
 
ప్రస్తుతం మాజీ కేంద్రమంత్రి పురందరేశ్వరి వైకాపా తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఆమెతో సంప్రదింపులు జరపడానికి జగన్ రోజాను పంపారంట. గత కొన్నిరోజుల ముందు బెంగుళూరులో జగన్‌ను కలిసిన పురందరేశ్వరి వైకాపాలోకి వస్తానని చెప్పొచ్చారట. అయితే పురందరేశ్వరి ఆహ్వానం పలికిన జగన్ ఆ తరువాత రోజా ద్వారా పురందరేశ్వరితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పురందరేశ్వరి ఆమెకు ఆమే పార్టీలోకి వస్తానని చెప్పడంతో జగన్‌కు బాగా కలిసొచ్చే అంశమైంది. పురందరేశ్వరికి ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రస్తుతం బిజెపి నుంచి ఆమె అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ నాయకులతో మంచి పరిచయాలున్నాయి.
 
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఖచ్చితంగా పురందరేశ్వరి లాంటి వ్యక్తి అవసరం. అందుకే జగన్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజాను పంపి పురందరేశ్వరితో మాట్లాడి రమ్మని చెప్పారట. హైదరాబాద్‌లో ఉన్న పురందరేశ్వరిని రోజా మర్యాదపూర్వకంగా కలిసి వైకాపాలోకి రమ్మని కోరారట. 40 నిమిషాలకు పైగా పురందరేశ్వరి, రోజాకు మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట. త్వరలోనే వైకాపాలోకి వస్తానని పురందరేశ్వరి చెప్పడంతో నవ్వుతూ బయటకు వచ్చేశారట రోజా.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments