Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలంలో మళ్లీ మంటలు.. కారణం ఎవరు..?

పచ్చని కొండల్లో చిచ్చు రేగుతోంది. ఎవడు రాజేస్తున్నాడో తెలియదు కానీ ఎటుచూసినా దావానంలా మంటలు వ్యాపిస్తున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం సాక్షిగా అగ్నిదేవుడు ఆగ్రహానికి శేషాచల కొండలు తగలబడిపోతున్నాయి. ఎంతో

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (14:53 IST)
పచ్చని కొండల్లో చిచ్చు రేగుతోంది. ఎవడు రాజేస్తున్నాడో తెలియదు కానీ ఎటుచూసినా దావానంలా మంటలు వ్యాపిస్తున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం సాక్షిగా అగ్నిదేవుడు ఆగ్రహానికి శేషాచల కొండలు తగలబడిపోతున్నాయి. ఎంతో యంత్రాంగం ఉండి కోట్ల రూపాయలు నిధులున్నా మంటలు అదుపుచేయలేని దుస్థితిలో తితిదే మిన్నకుండిపోతోంది. ప్రతియేటా మంటలు వ్యాపిస్తున్నప్పటికీ తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ఏడుకొండల వాడి గుండెల్లో రగులుతున్న అగ్నిజ్వాలలపై ప్రత్యేక కథనం.
 
తిరుపతి అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరు ఇట్టే గుర్తుండిపోతుంది. కలియుగ ప్రత్యక్షదైవం నెలకొని ఉండటం వల్ల తిరుపతికి అంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే ఆ దేవుడి సాక్షిగానే జరుగుతున్న పెనుప్రమాదాలను ఎవరూ అరికట్టలేకపోతున్నారు. శేషాచలంలో ఎండాకాలం వచ్చిదంటే చాలు ఎక్కడపడితే అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. వాటిని అదుపుచేయలేక చూస్తూ ఉండిపోతున్నారు ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు టిటిడి ఉద్యోగులు. అసలు శేషాచలంలో మంటలు రేగడానికి కారణాలేంటి. ఎవరే వ్యక్తులే అంటిస్తున్నారా.. లేకుంటే ప్రకృతి వైపరీత్యంగానే సంభవిస్తోందా.. గత నాలుగేళ్ళుగా మంటలు వస్తున్నప్పటికీ పరిష్కార మార్గాలను ఎందుకు కనుగొనలేకపోతున్నారు.
 
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న శేషాచల అడవులు ఎన్నో జీవజాతులకు ఆవాసయోగ్యం. వాటన్నింటి కంటే కూడా తిరుమల వెంకన్న వెలసింది కూడా ఆ శేషాచల అడవుల్లోనే. ఎర్రచందనానికి పుట్టినిల్లుగా బాసిల్లుతున్న ఈ శేషాచల అడవులు ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా దొరకని రూ.వేల కోట్లు విలువచేసే ఎర్రచందనం కేవలం శేషాచలంలో మాత్రమే దొరుకుతుంది. దానికితోడు ఎన్నో అరుదైన జంతు జాలాలు కూడా ఈ అడవిలో ఉన్నాయి. అయితే పర్యావరణంపరంగా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అడవులపై అగ్నిదేవుడు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. వేసవికాలం వచ్చిదంటే చాలు మంటల రూపంలో విరుచుకుపడుతూ పచ్చనిచెట్లను కాల్చిబూడిద చేసేస్తున్నారు. 
 
నిజానికి ఈ మంటలు వ్యాపించడానికి మొదటి ఎర్రచందనం స్మగ్లర్లేనని భావించినప్పటికీ ఒకే సమయంలో అనేక చోట్ల మంటలు వ్యాపించడానికి బట్టి చూస్తే ఇది సహజ సిద్ధంగానే మంటలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. వేసవికాలం వచ్చిదంటే రాలిపోయిన ఆకులన్నీ దట్టంగా పేరుకుపోవడం వల్ల పెనుగాలులు సంభవించిన సందర్భంలో పెద్ద పెద్ద వృక్షాల మధ్య రాపిడికి మంటలు చెలరేగి అవి ఆకులకు అంటుకోవడం వల్ల ఆ మంటలు పెనుజ్వాలలుగా మారుతున్నాయి. అయితే చాలాకాలం వర్షాలు పడకపోవడం, ఎండు ఆకులు ఎక్కువగా పేరుకుపోయిన సమయాల్లో ఫారెస్ట్ అధికారులు వాటిని వీలైన చోట్లల్లా వేరు చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ మంటలు వ్యాపించినప్పటికీ వాటిని వెంటనే అదుపుచేయలేకపోతున్నారు. 
 
ఇకపోతే... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండలపై నిత్యం భక్తుల సంచారం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో అయినా టిటిడి అధికారులు కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మంటల వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. కానీ మంటలు వ్యాపించినప్పుడు హెలికాప్టర్లు తెచ్చి హడావిడి చేయడమేకాకుండా మంటలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తితిదే అధికారులకు ఇప్పటికీ ఒక అవగాహన లేకపోవడం దురదృష్టకరం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments