Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఓదార్పు యాత్ర.. రాహుల్ భరోసా యాత్ర.. సేమ్ టు సేమ్!

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (11:28 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు.. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రకు పెద్దగా తేడా లేదని... అంతా సేమ్ టు సేమ్ అంటూ టాక్ వస్తోంది. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్, బాధితుల ఇళ్లల్లో నేలపై కూర్చుని, వారు పెట్టిందే తిని, వారితో సుదీర్ఘంగా మాట్లాడి వచ్చేవారు. అచ్చం అలాంటి పరామర్శలే ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నాయి. 
 
'రైతు భరోసా' యాత్ర పేరిట ఆదిలాబాదు జిల్లా కొరిటికల్ గ్రామంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వర్ ఇంటిలోపలికి వెళ్లిన రాహుల్, నేలపై కూర్చుని రాజేశ్వర్ భార్య, కుమారుడితో సుదీర్ఘంగా మాట్లాడారు. రాజేశ్వర్ కుమారుడిని ఆప్యాయంగా భుజం తట్టారు. రాజేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. అధైర్యపడొద్దని, అండగా నిలుస్తామని వారికి భరోసా ఇచ్చారు.
 
మరోవైపు ఆదిలాబాదు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తూ వెళుతూనే ఆయా కుటుంబాలకు ఆర్థికంగానూ చేయూతనందిస్తున్నారు. కొరిటికల్ గ్రామంలో వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్, ఆ కుటుంబానికి రూ.2 లక్షలను అందజేశారు. అదేవిధంగా లక్మణచాందలో ఆత్మహత్య చేసుకున్న లింగయ్య కుటుంబానికి కూడా ఆయన రూ.2 లక్షల మేర ఆర్థిక సహాయం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments