Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌తో ఎలా వేగాలో అర్థంకాక.. తలపట్టుకుంటున్న బాబు!!

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (16:48 IST)
ఏపీ సీఎం చంద్రబాబుకు తాను చూసి ఎదిగిన కేసీఆర్‌తో తలనొప్పి తప్పట్లేదు. తన పార్టీ నుంచి ప్రత్యేక పార్టీ పెట్టి సీఎం స్థాయికి ఎదిగిన కేసీఆర్‌తో ఎలా వేగాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏమాత్రం అర్థం కావట్లేదు. పాపం చంద్రబాబు నాయుడు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. ఆయన ప్రమేయం లేకుండానే తెలంగాణలో విలన్‌గా మారిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆనందంలో ఉన్న బాబును తెలంగాణ ముఖ్యమంత్రి ధర్మసంకటంలో పడేస్తున్నారు. ఏపీలో ఎలాగూ అధికారంలోనే ఉన్నాం కనుక తెలంగాణ ప్రజలను కూడా మచ్చిక చేసుకుందామని ఎంత సర్ధుకుపోదామనుకున్నా, కేసీఆర్ ఆయన ఆటలు సాగనివ్వడం లేదు. 
 
గతంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తనతో కరచాలనం చేసిన చంద్రబాబును మరుసటి రోజే కేసీఆర్ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కేంద్రంతో కలిసి పుల్లలు పెడుతున్నాడని ఆరోపించారు. తాజాగా బీజేపీ నేత దత్తాత్రేయ నిర్విహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, చంద్రబాబు ముఖంపై నవ్వు పులుముకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఆలింగనం చేసుకున్నారు.

అయితే, కాసేపటికే చంద్రబాబు ఓ కర్కోటకుడంటూ కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. దీంతో చంద్రబాబు కేసీఆర్ ఏం మనిషిరా బాబూ.. ఈయనతో ఎలా వేగాలబ్బా అంటూ తలపట్టుకుంటున్నారు. మరి కేసీఆర్‌ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. 

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

Show comments