Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు: ముమ్మరంగా సహాయచర్యలు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (11:20 IST)
తమిళనాడులోని సోమనాయినిపట్టి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘనటలో 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి కన్యాకుమారికి వెళుతున్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ సోమనాయినిపట్టి స్టేషన్‌కు సమీపంలో వస్తుండగా పట్టాలు అదుపుతప్పింది. మొత్తం ఐదు బోగీలు పట్టాల నుంచి విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది.
 
బోగీల్లో చిక్కుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 5.30గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఎలాంటి సహాయం అందకపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు తమ లగేజిలతో సహాయచర్యల కోసం ఎదురుచూస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమేంటని ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments