Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు...?

వెంకయ్యనాయుడు. పెద్దగా పరిచయం లేని వ్యక్తి. నెల్లూరు జిల్లాలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశ రాజకీయాలను శాసించేస్థాయికి చేరిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (14:37 IST)
వెంకయ్యనాయుడు. పెద్దగా పరిచయం లేని వ్యక్తి. నెల్లూరు జిల్లాలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశ రాజకీయాలను శాసించేస్థాయికి చేరిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. అందుకే ప్రధానికే వెంకయ్య సలహాలు ఇస్తుంటారు. మోడీ ప్రవేశపెట్టే పథకాలలో ఎక్కువ వెంకయ్య చెబితేనే అమలు చేస్తున్నారంటే ప్రధాని ఆయన మాటలకు ఎంత విలువ ఇస్తారో ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం వెంకయ్య కేంద్ర సమాచార శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. అయితే వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని అనుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున వెంకయ్యే అభ్యర్థని ఎవరో చెప్పలేదు స్వయంగా వెంకయ్యే చెప్పడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఇప్పటివరకు బీజేపీ తరపున రాష్ట్ర అభ్యర్థిగా జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్ము పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఉన్నట్లుండి చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు కూడా పరిశీనలో ఉందని చెప్పాడు. ఆ కార్యక్రమానికి హాజరైన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 
 
సమావేశంలో వెంకయ్య స్పీచ్ తర్వాత ఒకరి నొకరు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థి తానేనంటూ వెంకయ్య చెప్పడం పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి గోప్యంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారట. ఇదే కనుక జరిగితే నీలం సంజీవరెడ్డి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న రెండో తెలుగు వాడు వెంకయ్యనాయుడే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments