Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి టాలీవుడ్ హీరో.. ఎంపీగా పోటీ!

శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే శివాజీకి ప్రాణం. ముందు నుంచీ అన్నయ్య సినిమాలో నటించాలంటే ఎంతో ఇష్టం.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (14:57 IST)
శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే శివాజీకి ప్రాణం. ముందు నుంచీ అన్నయ్య సినిమాలో నటించాలంటే ఎంతో ఇష్టం. అలాంటి అవకాశం చాలాసార్లు శివాజీకి వచ్చింది. అయితే ఆ తర్వాత సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని శివాజీ సమాజంలో జరుగుతున్న సంఘటనపై దృష్టి పెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. రకారకాల ఆందోళనలతో శివాజీ ముందుకెళ్ళారు. అయితే ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది గానీ శివాజీకి మాత్రం మంచి పేరే వచ్చింది. ఒక ఉద్యమంలా ప్రత్యేక హోదాను తీసుకెళ్ళడంతో జనంలో శివాజీకి ఒక గుర్తింపు వచ్చింది.
 
ఆ తర్వాత శివాజీ ఏదో ఒక రాజకీయపార్టీలోకి వస్తారనుకుని అందరూ భావించారు. అయితే ఉన్న రాజకీయ పార్టీల కన్నా కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలవైపు వెళ్ళాలన్నది శివాజీ ఆలోచన. అందుకే శివాజీ జనసేన వైపు దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్‌‌తో ఇప్పటికే శివాజీకి మంచి రాపో ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. శివాజీ గతంలో ఆందోళన చేసేటప్పుడు పవన్ స్వయంగా అభినందించారు. 
 
అయితే అప్పట్లో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో లేకపోవడంతో శివాజీ సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆ తర్వాత జనసేన పార్టీలోకి కొత్త రక్తం వెళుతుండటంతో శివాజీ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. నేరుగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కే చెప్పారట శివాజీ. శివాజీ లాంటి వ్యక్తి తన పార్టీలోకి వస్తే పవన్ కాదంటారా. ఎప్పుడైనా మీరు రావచ్చు అని చెప్పారట పవన్. అది కూడా ఎంపి స్థానానికే పోటీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడట పవన్. మొత్తం మీద వీరిద్దరు కలిస్తే ప్రజలు బాగా ఆదరిస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments