Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేపీ బర్త్ డే జగన్... 45వ వసంతంలోకి జగన్... 2019 ఎన్నికల్లో సత్తా చాటుతారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైయస్. జగన్మోహనరెడ్డి జన్మదినం నేడు. 45వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ నేత తన తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకువచ్చి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో తెలుగుద

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైయస్. జగన్మోహనరెడ్డి జన్మదినం నేడు. 45వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ నేత తన తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకువచ్చి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చి పరాజయం పొందారు. ఎన్నికలు ముగిసి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన రెండున్నర సంవత్సరాల కాలంలో అధికార పక్ష వైఖరిని ఎండగట్టే సందర్భాలు ఎన్నో వచ్చినప్పటికీ వాటిని ఈ నేత సరిగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ఎ
 
న్నికలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 100 హామీలలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని జగన్ నేతృత్వంలోని పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మాత్రం విఫలమవుతుంది. రాజధాని నిర్మాణం విషయంలో అప్పుడప్పుడు విమర్శలు చేయడం తప్ప ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో వై.యస్.ఆర్.సి.పి వైఫల్యం చెందిందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల పైచిలుకు ఓట్లతో అధికారాన్ని కోల్పోయిన జగన్, ఆ తదనంతరం ఆ స్థాయిలో ప్రజాభిమానాన్ని నిలుపుకుంటున్నారా అనేది సందేహాస్పదమే. 
 
రాష్ట్ర విభజన, ఆర్థిక లోటు, ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వ తీరు, ప్రచారానికే తప్ప పనులు ప్రారంభం కాని రాజధాని, ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు... తదితర పరిస్థితులన్నీ ఉపయోగించుకోవాలనే గానీ జగన్‌కు ప్రభుత్వం పై విరుచుకుపడటానికి శక్తివంతమైన ఆయుధాలే. కానీ ఈ అవకాశాలను జగన్ ఉపయోగించుకోలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, మోనోపోలిగా వ్యవహరించడం, సీనియర్ల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, మనస్సు విప్పి మాట్లాడకపోవడం.. ఇవన్నీ ప్రతిపక్షనేత వైఫల్యానికి కారణాలని ఆ పార్టీలోని నాయకులే గుసగుసలాడుకుంటుంటారు. 
 
ఇప్పటికే కొందరు యం.ఎల్.ఎ.లు పార్టీ ఫిరాయించి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాలలో అరంగ్రేటం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన తీరులో కూడా జగన్ నోరు మెదపకపోవడం ఆయన అభిమానులను కలవరపరుస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రధాన ప్రతిపక్షనేత జగనా లేక పవనా అనే సందేహం కూడా రాష్ట్ర ప్రజలలో కలుగుతుంది. రానున్న రోజుల్లో అయినా జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిలా అందరిని కలుపుకొని, అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని ముందుకు సాగితే 2019 ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఆయన ఆవిధంగా ముందుకు సాగాలనీ అభిమానులు కోరుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments