Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రరిస్టులు ఎలా చొరబడ్డారు.. మోడీ సర్కార్ ఏం చేస్తోంది..? హిందూ దేశంగా..?

Webdunia
సోమవారం, 27 జులై 2015 (16:15 IST)
సరిహద్దుల్లోకి పది మంది టెర్రరిస్టులు చొరబడటంపై దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టమైంది. భారత్‌పై ఉగ్రదాడి జరగవచ్చునని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో.. పంజాబ్‌లోని దీనానగర్లోకి పది మంది టెర్రరిస్టులు రావడంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇంటలిజెన్స్ వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఏం చేస్తుందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 
 
పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు ఏడుగురు పోలీసులు, లాకప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సైన్యం, పంజాబ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమైనట్టు సమాచారం.
 
భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌ను ఉగ్రవాదులు తమ అదుపులోకి తీసుకోవడంపై విపక్షాలు దుయ్యబట్టాయి. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పంజాబ్‌లో స్త్వైర విహారం చేయడంతో మోడీ సర్కారు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంపై విఫలమైందని ఆరోపిస్తున్నాయి. 
 
అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రదాడులపై పూర్తిగా దృష్టి సారించారు. ఢిల్లీ నుంచే పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పంజాబ్ పోలీసులకు సహకరించాలని బీఎస్ఎఫ్ బలగాలను ఆదేశించారు. మరోవైపు, అంతర్జాతీయ సరిహద్దుపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని... సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
 
కాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్న, ఇసిస్ జెండాలు రెపరెపలాడుతున్న మోడీ సర్కారు మౌనంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. భారత దేశాన్ని హిందూ దేశంగా చేయడంలో తలమునకలైన బీజేపీ ప్రభుత్వం.. టెర్రరిస్టులను దేశంపైకి ఉసిగొల్పుతుందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 
 
యాసిన్ భత్కల్ జైలులో ఉండడం, మెమన్‌ను ఉరితీయడానికి రంగం సిద్ధం కావడంతో టెర్రరిస్టులు భారత్‌పై దాడికి పాల్పడే అవకాశముందని హెచ్చరించినా.. భద్రతను మరింత బలోపేతం చేయడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఎన్డీయే నిర్లక్ష్య వైఖరితోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments