Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో డ్రగ్స్ మాఫియా - ఎస్వీయులో విద్యార్థుల చేతిలో హుక్కా...!

ఇప్పటివరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన డ్రగ్స్, హుక్కా సంస్కృతి ఇప్పుడు ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా విస్తరించిందా? ఇదే నిజమేనని అనిపిస్తోంది. తిరుపతిలో జరిగిన సంఘటనలను గమనిస్తే తిరుపతి ఎస్వీ యూనివర

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:59 IST)
ఇప్పటివరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన డ్రగ్స్, హుక్కా సంస్కృతి ఇప్పుడు ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా విస్తరించిందా? ఇదే నిజమేనని అనిపిస్తోంది. తిరుపతిలో జరిగిన సంఘటనలను గమనిస్తే తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాలలోని విశ్వతేజా హాస్టల్‌లో పోలీసుల దాడిలో హుక్కా పాత్రతో పాటు రూమ్ నిషేధిత వస్తువులు లభ్యం కావడంతో డ్రగ్స్ మాపియాకు తిరుపతి అడ్డాగా మారనుందా అన్న రీతిలో అర్థంకానీ ప్రశ్నలు బయటపడుతున్నాయి. 
 
ఓకే చోట తొమ్మిది యూనివర్సిటీలు, వందల సంఖ్యలో మిగతా విద్యాసంస్థలు, ఏకంగా పాతిక వేల మందికిపైగా విద్యార్థులు వున్న తిరుపతిపై డ్రగ్స్ మాఫియా కన్నెసిందా. విద్యార్థులతోపాటు యాత్రీకులను దృష్టిలో ఉంచుకోని తమ అమ్మకాలు పెంచుకోవడానకి ప్రయత్నాలు సాగిస్తుందా అంటే అది నిజమేనని అనిపిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైల్వేతో పాటు విమాన సౌకర్యం ఉండటం కూడా అక్రమ రవాణాదారులకు కలసి వస్తుంది.
 
దీనికితోడు ఇప్పటికే తిరుపతి పరిసరాల ప్రాంతాలలోని శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు కూడా తిరుపతి అడ్డాగా ఉన్నారు. దీనికితోడు వ్యభిచార ముఠాలు కూడా నగరంలో ఉన్నాయి. ఇవి చాలావరకు ఆన్‌లైన్ ద్వారా దందా నడిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థినుల బలహీనలతోపాటు అర్థికంగాలేని వారిని ట్రాప్ చేసి ఆటోవాలాల రవాణాదారులుగా పెట్టుకోని ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. 
 
చాలమంది ఆటోవాలాలు హాస్టల్స్‌లో ఉన్న అమ్మాయిలకు కుటుంబ సభ్యులలాగా పోన్ చేసి పిలిపిస్తారు. బయటకు రాగానే నేరుగా అప్పటికే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా బుకింగ్ అయిన కస్టమర్ దగ్గరకు తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో అటోలోకి ఎక్కగానే అమ్మాయి మొడలో రెడీమేడ్ తాళితో పాటు, మొట్టెలు వేసుకొని వెళతారు. దీంతో రైడింగ్‌ల గొడవ కూడా వుండదు. ఈవ్యవహారంలో ఆన్‌లైన్ బుకింగ్‌దారుడుతో పాటు ఆటోవాల షేర్ పోను మిగతాకి అమ్మాయిలకు ఇస్తుంటారు. అయితే ఈ వ్యవహారం ఎక్కువుగా శని, అదివారాలలో జరుగుతుంటాయి. ఇక విద్యార్థినులను ట్రాప్ చేసి సరపరా చేస్తున్న వ్యక్తులు నాయకులకు కూడా చలామణి అవుతున్నారు.
 
ఇక తిరుపతి నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతుంది. ఎక్కువుగా రైల్వే పార్సిల్ ద్వారా వైజాగ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంటుంది. పడమటి మండలాలకు చెందిన ఓ ముఠా ఇందులో కీలకంగా వ్యవహారిస్తుంది. పలుమార్లు పట్టుబడినప్పటికి వీరు ప్రతిసారి రవాణా మాత్రం అపడం లేదు. ఎక్సెజ్ శాఖ మాత్రమే అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంది. అయితే చెన్నై, బెంగుళూరుకు ఎక్కువుగా రవాణా జరుగుతుందని అంటున్నప్పటికి గత రెండు సంవత్సరాలుగా స్థానిక మార్కెట్‌ను వీరు విస్తృతం చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరు నగర శివార్లలో వున్న ఇంజనీరింగ్ కళాశాలతో పాటు యూనివర్సిటీ విద్యార్థులను టార్గెట్ చేసి అమ్మకాలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
రెండు మొడికల్ కాలేజీలతో పాటు నాలుగు యూనివర్సిటీలు, ఇక టీడీపీ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ కళశాలలతో పాటు డీగ్రీ స్థాయి విద్యార్థులను టార్గెట్ అమ్మకాలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులు కూడా ఆ దిశగా తమ దృష్టి సారించినట్లు సమాచారం. మంగళవారం ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజిలోని విశ్వతేజా హాస్టల్‌లోకి హుక్కా పాత్రను తెచ్చింది కూడా కడప జిల్లా చెందిన డిగ్రీ విద్యార్థిని తిరుపతి ప్రైవేట్ డిగ్రీ కాలేజిలో చదువుతున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారం చాలకాలం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తొంది. 
 
మొత్తం మీదా డ్రగ్స్ మాఫియా కన్ను తిరుపతి మీదా పడింది. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు ముందుగా దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే ఎర్రస్మగ్లర్లు విద్యార్థులను విలాస జీవనానికి అలవాటు చేసి వారిని స్మగ్లింగ్‌లో వాడుకుంటున్న నేపథ్యం వుంది. వారు మరింతగా దిగజారకుండా అసాంఘిక శక్తులను హాస్టల్స్‌లోకి రాకుండా చర్యలు తీసుకోక పోతే డ్రగ్స్ మాఫియా లీలలు మరింతంగా పెరిగే అవకాశముంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments