Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరికి చంద్రబాబు - కుప్పంకు నారా లోకేష్‌

అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చావంటూ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న నారా లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడపడంతో పాటు తాను కూడా ఎమ్మెల్

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (16:58 IST)
అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చావంటూ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న నారా లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడపడంతో పాటు తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది తీవ్ర ఆశక్తికరంగా మారింది. తనయుడు కోసం తండ్రి తన కుప్పం సీటును త్యాగం చేస్తాడని కొందరు అంటుంటే లేదు సొంతూరు చంద్రగిరి నుంచే బరిలోకి దిగితే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో లోకేష్‌, చంద్రబాబులు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి.
 
రాజకీయాల్లోకి చకాచకా వారసులు వచ్చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో హోరాహోరీగా పోటీ పడ్డ ప్రధాన నాయకులందరు తమ వారసులతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ వారసుడిగా జగన్ తన రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఇక అటువైపు కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో తన వారసుడు ఎక్కడ వెనుకబడి పోతాడేమోనన్న భయంతో చంద్రబాబు కూడా లోకేష్‌ను మంత్రిని చేసి కీలక బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో వారసులే అంతా ముందు నడిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో లోకేష్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నాడు. ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు అన్న విషయాలపై అప్పుడే చర్చ మొదలైంది. దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో  గెలిచి మంత్రిగా పనిచేయాలంటూ ఇప్పటికే వైసీపీ నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్న లోకేష్‌ వాటికి చెక్ పెట్టే విధంగా ప్రత్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధంచేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. తన తండ్రి ఎప్పటి నుంచో ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచా లేక తన సొంతూరు చంద్రగిరి నుంచా. ఇవి రెండు కాకుండా పాత సెంటిమెంటును ఫాలో అవుతూ కృష్ణా జిల్లా నుంచి ఎక్కడ నుంచైనా పోటీ చేసే అవకాశాలున్నాయా? 
 
ఇప్పటికే మంత్రి పదవి అనుభవిస్తున్న లోకేష్‌కు చిత్తూరు జిల్లా కోటాలోనే మంత్రి పదవిని అప్పగించారు చంద్రబాబు. ఈ లెక్కన భవిష్యత్తు రాజకీయాల్లో చిత్తూరు నుంచి లోకేష్‌ నడిపించబోతున్నాడన్న సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయడం కన్ఫామ్. అయితే నియోజవర్గం ఏదన్న దానిపైన ఆశక్తి నెలకొంది. సొంతూరు చంద్రగిరి నారావారి కుటుంబానికి పెద్దగా కలిసి రాలేదు. 
 
గతంలో చంద్రబాబు అక్కడి నుంచి ఒకసారి ఓడిపోయాడు కూడా. అప్పటి నుంచి కుప్పం నుంచే పోటీ చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు. చంద్రగిరిలో కనీసం వేరే టిడిపి అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని పరిస్థితి ఉంది. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీకి చంద్రగిరి నియోజకవర్గం కంచుకోటగా ఉంటే, గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడగొట్టి గెలిచాడు. ఇప్పడు లోకేష్‌ చంద్రగిరి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకోసమే తన కొడుకును సేఫ్ జోన్‌లో పెట్టడం కోసం టిడిపికి కంచుకోటయిన కుప్పం నుంచే లోకేష్‌ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తాడన్నది మళ్ళీ చర్చనీయాంశమైంది. 
 
ఒకవేళ చంద్రబాబును కాదని లోకేషే కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్రబాబు కంటే అత్యధిక మెజారిటీతో యువనాయకుడు లోకేష్‌ బాబును తొడగొట్టి గెలిపించుకుంటామంటున్నారు కుప్పం నాయకులు. అయితే పప్పుశుద్దగా పేరు పొందిన లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమంటున్నారు వైకాపా నాయకులు. గత ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీని భారీగా వాయిస్ ఓవర్ 3.. కాంగ్రెస్ కూడా కుప్పం నుంచి లోకేష్‌ గెలిచే అవకాశం లేదంటోంది. వరుసగా టిడిపికే ఓట్లు వేస్తూ వచ్చిన కుప్పం ప్రజలు చంద్రబాబుపై పూర్తి వ్యతిరేకతో ఉన్నారని అది తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికలపై ఇప్పటికే చిత్తూరుజిల్లాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో లోకేష్‌ ఏ మేరకు సత్తా చాటుతాడో.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

240 దేశాలలో షో ప్రసారం కావడం హ్యాపీగా వుంది : రానా దగ్గుబాటి

సాహిబా లో ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవంలో రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments