చంద్రబాబుకు మూడిందా? మే23కి తర్వాత రిటైర్మెంట్ ఖాయమా?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే.. కానీ ఆయన అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిమియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం తేల్చిపారేశారు. పైగా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి తనను ఎలాంటి సమీక్షలకు ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. పవర్ లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన తేల్చి పారేశారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మే 23న రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. వచ్చే ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే.. ఇక చంద్రబాబుకు అన్ని దారులూ మూసుకుపోయినట్టే అని ఆ పత్రిక విశ్లేషించింది. 2004 నుంచి చంద్రబాబు రాజకీయ పోకడలను సునిశితంగా సదరు ఆంగ్ల పత్రిక విమర్శించింది. 
 
చంద్రబాబు ఎత్తుగడలు ఎలా విఫలమైందీ డిటైల్డ్‌గా చర్చించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా తప్పుటడుగులు వేసారని చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను వివరించారు. పవన్ కల్యాణ్ పార్టీ వేరుగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలుతుందని చంద్రబాబు తప్పుగా అంచా వేశారని ఆ పత్రిక పేర్కొంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా క్యాస్ట్, కరప్షన్, క్రైమ్‌గా సాగిపోయిందని ఆ పత్రిక రాసుకొచ్చింది. ఇది ప్రజావ్యతిరేకతను పెంచిందని పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పళ్లిచట్టంబి మా డ్రీమ్ ప్రాజెక్ట్,మనందరి సినిమా కాబోతోంది - టొవినో థామస్

Vaishnavi: 2 మిలియన్లను దాటిన ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ లోని తొలి గీతం సంచారమే.

Nayanthara.:సల్మాన్ ఖాన్, నయనతార కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి చిత్రం

Anushka: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రొజిన్ థామస్ తెరకెక్కించిన కథనార్ ట్రైలర్ విడుదల

సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments