Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంపై విమానాలను నిషేధించలేరా? ఉద్యమానికి సిద్ధమవుతున్న స్వామీజీలు!

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలను నిషేధించలేమని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల వెంకన్న నెలవై ఉ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (11:49 IST)
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలను నిషేధించలేమని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల వెంకన్న నెలవై ఉన్న ప్రాంతం వరకు నో ఫ్లైయింగ్‌ జోన్ ప్రకటన ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చిన్నజియ్యర్‌తో పాటు స్వరూపా నందేంద్రస్వాములు ఎప్పటి నుంచో ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. గతంలో విమానాలు ఆలయంపై భాగాన నుండి వెళ్ళిన సమయంలో తితిదే ఉన్నతాధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూడాలని కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు హెచ్చరించారు. అయినా సరే ఎలాంటి మార్పు లేదు. విమానాలు మాత్రం ఆలయం పైభాగాన నుంచి రయ్యిరయ్యిమంటూ తిరుగుతూనే ఉన్నాయి. 
 
అసలు కేంద్రవిమానయాన శాఖ ఏం చెబుతోందంటే తిరుపతిలో ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితులు ఉండడం వల్ల విమానాల నిర్వహణ కష్టంగా మారిందని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల కొండపై అదనపు నిషేధాజ్ఞల వల్ల తిరుపతి విమానాశ్రయం వినియోగం మరింత కుచించుకుపోయి విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తోంది. తిరుపతి విమానాశ్రయం కొండల మధ్య ఉండడం వల్ల పశ్చిమాన 5,900 అడుగుల ఎత్తు, తూర్పున 4,600 ఎత్తు మాత్రమే అందుబాటులో ఉంది. తిరుపతి నుంచి రాకపోకలు సాగిచే అన్ని విమానాలు తిరుమల, కొండల మధ్య ఉన్న కొంత స్థలంలోనే పైకి ఎగరాల్సి వస్తోంది. ఇక్కడున్న భౌగోళిక పరిమితుల దృష్ట్యా రన్‌వే పై రాకపోకలు సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
 
భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రపతి భవన్‌, అణు ఇంధన కేంద్రాలను మాత్రమే కేంద్రం ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. అందుబాటులో ఉన్న గగనతలాన్ని దేశీయ అవసరాలకు తగ్గట్లు గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం కోసం ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు మిగతా ప్రాంతాలను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతం కింద చేర్చడానికి అంగీకరించడం లేదు. దేశంలో చాలా ప్రాంతాను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పౌరవిమానయాన శాఖకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇందుకు అంగీకరించడం లేదు. ఈ కారణంతోనే శ్రీహరికోట, మహేంద్రగిరి అంతరిక్ష కేంద్రం, తాజ్‌మహల్‌, అయోధ్య, శబరిమల, స్వర్ణదేవాలయాలను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించాలన్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవడం లేదు. గగనతలం పరిమితమైన సౌర్యభౌమాధికార ఆస్తి కాబట్టి దాన్ని పౌర, రక్షణ అంతరిక్ష సేవలకు వినియోగించాల్సి ఉంటుందని చెబుతోంది.
 
తాజాగా కేంద్రవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులు మండిపడుతున్నారు. తితిదే కూడా స్వయంగా కేంద్ర విమానయానశాఖకు ఎన్నోసార్లు ఇదే విషయంపై విజ్ఞప్తి చేసుకుంది. విమానాలు తిరగడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, మరోవైపు అరిష్టమని మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతున్నారని తితిదే తెలిపింది. అయితే ఖచ్చితంగా ఈ విషయంపై చర్చిస్తామని నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రవిమానశాఖ ప్రస్తుతం మాత్రం ఇలాంటి ప్రకటన చేసింది.
 
భద్రత దృష్ట్యా విమానాల రాకపోకలను నిషేధించాలని, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని ఎన్నోసార్లు కేంద్ర ఇంటిలిజెన్సే కేంద్రానికి కూడా నివేదించింది. ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది భక్తులు వచ్చే తిరుమల లాంటి రద్దీ ప్రాంతంలో ఖచ్చితంగా నో ఫ్లెయింగ్‌ జోన్‌ను ప్రకటించాలని మఠాధిపతులు, పీఠాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై ఉద్యమం చేయడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు సిద్ధమవుతున్నారు. తితిదే ఉన్నతాధికారుల చేతుల్లో ఈ విషయం లేదు కాబట్టి నేరుగా ఢిల్లీ కెళ్ళి కేంద్రంపై పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నారు. స్వాముల ఉద్యమాలపై కేంద్రం స్పందింస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments