Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భంధ తమిళంపై పవన్ పోరుబాట: అమ్మతో పెట్టుకోవద్దన్న బీజేపీ!?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:47 IST)
నిర్భంధ తమిళ భాషపై పవన్ కల్యాణ్ తమిళనాట పోరుబాట పట్టాలనుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిర్భంధ తమిళ భాషకు చెందిన జీవో అమల్లోకి వస్తే తెలుగు భాష కనుమరుగవుతుందనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హోసూరులో ఆందోళన చేపట్టాలని భావించారు. అయితే ఆపై పవన్ కల్యాణ్ దీక్ష గురించి ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు. ఇందుకు బీజేపీనే కారణమని వార్తలొస్తున్నాయి.  
 
నిర్భంధ తమిళంపై తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఆందోళన చేపట్టవద్దని బీజేపీ హైకమాండ్ విజ్ఞప్తి చేయడంతో పవర్ స్టార్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమాచారం. జయలలిత పార్టీతో సంబంధాలను పవన్ దీక్ష చెరపకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఇలా చెప్పినట్లు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని రంగంలోకి దింపినట్లు సమాచారం. 
 
అమ్మతో పెట్టుకోవద్దని వెంకయ్య పవన్‌కు నచ్చజెప్పడంతోనే నిర్భంధ తమిళంతో తెలుగు కనుమరుగవుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయారని టాక్ వస్తోంది. బీజేపీ-అన్నాడీఎంకేల మధ్య సంబంధాలకు బ్రేక్ పడకుండా ఉండాలంటే.. పవన్ కల్యాణ్ ఆందోళన చేపట్టకూడదని.. హైకమాండ్ చెప్పేయడంతో పవన్ దీనిపై మారుమాట్లాడటం లేదని అంటున్నారు. అందుకే హైదరాబాదులో ఇటీవల జరిగిన తమిళనాడు తెలుగు యువశక్తి సమావేశంలోనూ పవన్ పాల్గొనలేదని వారు చెప్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments