Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా పార్టీ మారితే సముచితస్థానం దక్కుతుంది.. కేడర్ :: లేదమ్మా.. ఊపిరి ఉన్నంతవరకు జగన్ చెంతనే ఉంటా.. భూమన!

వైకాపా నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే నాయకుల సంఖ్య రోజురోజుకో పెరుగుతోంది. ప్రజాప్రతినిధులే ఎక్కువగా తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు 20మందికిపైగా ఎమ్మెల్యేలు వైకాపా తీర్థం పుచ్చ

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (12:29 IST)
వైకాపా నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే నాయకుల సంఖ్య రోజురోజుకో పెరుగుతోంది. ప్రజాప్రతినిధులే ఎక్కువగా తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు 20మందికిపైగా ఎమ్మెల్యేలు వైకాపా తీర్థం పుచ్చుకోగా అదే బాటలో కొంతమంది సీనియర్‌ నేతలున్నారు. చంద్రబాబునాయుడును చడామటా తిట్టేసిన నాయకులందరు కూడా ప్రస్తుతం ఆయన చెంత చేరేందుకు సిద్ధమవుతున్నారు. తెదేపాలో సీనియర్లుగా ఉన్న వారితో సంప్రదింపులు జరిగి మెల్లగా పార్టీలోకి జారుకుంటున్నారు. అయితే మరికొంతమంది తమ అనుచరులు ఒత్తిడి తట్టుకోలేక పార్టీలు మారుతున్నారు. అదే పరిస్థితి తిరుపతి ఎమ్మెల్యే, మాజీ తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి కూడా వచ్చింది. అయితే తన కొన వూపిరి ఉన్నంత వరకు వైకాపాను వీడే ప్రసక్తే లేదని భూమన చెప్పినట్లు తెలుస్తోంది.
 
వైకాపాలో కీలకంగా ఉన్న నేతల్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్‌ నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఈయన ఎంత చెబితే అంతే. పార్టీలోని ముఖ్యులందరు కూడా ఈయనకు సన్నిహితమే. అందుకే వైకాపా తరపున ఎలాంటి కార్యక్రమమైనా ముందుంటారు. కాపు రిజర్వేషన్ల విషయంలో పార్టీ అధినేత జగన్... కరుణాకర్‌ రెడ్డికే మొత్తం బాధ్యతలు అప్పగించారు. తెరవెనుక నుంచి ముద్రగడను నడిపించిన బాధ్యత మొత్తం కరుణాకర్‌ రెడ్డే తీసుకున్నారు. సైలెంట్‌గా ఏ పనినైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆ పార్టీ నాయకులే కాదు మిగిలిన పార్టీలలోని నాయకులు కూడా చెబుతుంటారు. 
 
అయితే భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తన అనుచరులతో పాటు కొంతమంది పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. అదే పార్టీ మారే విషయంపైనే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళితే ఖచ్చితంగా సముచిత స్థానం లభిస్తుందని కొంతమంది అనుచరులు ఒక ప్రతిపాదనను కరుణాకర్‌ రెడ్డి ముందుంచారు. అంతేకాదు అవసరమైతే నేరుగా తెదేపా సీనియర్‌ నాయకులతోనే మాట్లాడి పార్టీలో చేరుదామని కూడా చెప్పుకొచ్చారు. రెండురోజుల క్రితం తిరుపతిలోని భూమన నివాసంలో అత్యవసరంగా సమావేశమైన వీరు కరుణాకర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం తీసుకువచ్చారు. అయితే ఈ విషయాలన్నీ కూలంకుషంగా విన్న కరుణాకర్‌ రెడ్డి తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతానని వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
 
తన అనుచరులు ఎంత వారించినా సరే కరుణాకర్‌ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గనట్లు తెలుస్తోంది. ఎంతమంది పార్టీ వదిలి వెళ్ళినా తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తెదేపా తీర్థం పుచ్చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయిపోతోంది. ఒక్క చిత్తూరు జిల్లానే కాదు ఎపి మొత్తం ఇదే పరిస్థితి. భూమన కరుణాకర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించినా సరే ఆయన అనుచరులు మాత్రం పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద భూమన కరుణాకర్‌ రెడ్డి కూడా వైకాపాలో ఉంటారా..లేక పార్టీ మారుతారా అన్నది మరి కొన్నిరోజుల్లో తేలిపోనుంది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments